- Telugu News Photo Gallery Spiritual photos 4 zodiac signs who are big time foodies, know whether you are also involved in this
Zodiac Signs Foodies: ఈ నాలుగు రాశులవారు మంచి ఆహార ప్రియులు.. అందులో మీరున్నారా లేదో తెలుసుకోండి..
Zodiac Signs Foodies: మంచి ఆహారం తినాలను అందరూ కోరుకుంటారు. అయితే కొంతమంది రుచితో సంబంధం లేకుండా దొరికింది తినేద్దామని బద్ధకించేవారు అయితే.. మరికొందరు.. తమకు నచ్చిన మది మెచ్చిన ఆహారం తినడానికి ఎంత దూరమైనా వెళ్లారు. ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు. ఆలా జిహ్వ చాపల్యం ఉన్న రాశులవారు ఎవరో తెలుసుకుందాం
Updated on: Dec 23, 2021 | 11:08 AM

మీన రాశి వారు మంది ఫుడీ.. ఈ రాశివారికి అభిరుచులు మంచి ఆహారం, విశ్రాంతి. మీన రాశివారు వివిధ వంటకాలను రుచి చూడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కనుక ఈ రాశివారికి మంచి ఆహారం తినిపించి.. సులువుగా మనసు గెలుచుకోవచ్చు.

సింహ రాశి వారు ఆహార ప్రియులు. ఈ వ్యక్తులు ఆకలితో ఉన్నప్పుడు కోపంగా ఉంటారు. జీవితంలో వీరికి కావాల్సింది ప్రేమ, ఆహారం. వీరికి మంచి ఆహారం తినిపించి ఈజీగా ఆకట్టుకోవచ్చు. స్ట్రీట్ ఫుడ్, ఇంట్లో వండిన ఆహారం ఇలా ఏ తేడాలు చూడడు.. ఎటువంటి ఆహారం అయినా సింహ రాశి వారు తినడానికి ఇష్టపడతారు.

కర్కాటక రాశివారు కూడా మంచి ఆహారప్రియులు., కొత్తరకాల వంటలను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. వీరికి ఇష్టమైన ప్రదేశాలు ఫ్యాన్సీ రెస్టారెంట్లు. ఒక కప్పు కాఫీ, రుచికరమైన చిరుతిండితో కోపాన్ని శాంతపరచవచ్చు.

ధనుస్సు రాశి వారు కూడా మంచి ఆహార ప్రియులు. తినే ముందు ఆహారాన్ని వాసన చూడడానికి ఇష్టపడతారు. వారు వివిధ రకాల వంటకాలను ప్రయత్నించడానికి ఇష్టపడతారు. ధనుస్సు రాశి వారు తమ ఆహారాన్ని ఇతరులకు పెట్టడానికి ఎప్పుడూ ఇష్టపడరు.





























