5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ..! అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..

Corona virus Risk: పిల్లల్లో కరోనా ప్రమాదానికి సంబంధించి బ్రిటన్‌లో కొత్త పరిశోధన అధ్యయనం వెలువడింది. లండన్ ఇంపీరియల్ కాలేజ్,

5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ..! అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..
Corona Vaccine
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 24, 2021 | 6:55 AM

Corona virus Risk: పిల్లల్లో కరోనా ప్రమాదానికి సంబంధించి బ్రిటన్‌లో కొత్త పరిశోధన అధ్యయనం వెలువడింది. లండన్ ఇంపీరియల్ కాలేజ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. పెద్దల కంటే 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఇంగ్లండ్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని శాస్త్రవేత్తలు పిల్లలకు టీకాలు వేయడం చాలా ముఖ్యమని చెప్పారు. అదృష్టవశాత్తూ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నపిల్లలకు UKలో టీకా ఆమోదించారు.

97000 నమూనాలను పరీక్షించారు ఇంపీరియల్ కాలేజీ, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సోస్ మోరీ పరిశోధకులు పరిశోధన సమయంలో దాదాపు 97,000 కరోనా నమూనాలను పరీక్షించారు. ఈ నమూనాలను నవంబర్ 23 నుంచి డిసెంబర్ 14 మధ్య తీసుకున్నారు. పరిశోధన అధ్యయనంలో ప్రాథమిక పాఠశాల పిల్లలలో 4.47 శాతం మందిలో కరోనా వైరస్ నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య దేశవ్యాప్తంగా 1.41 శాతం మాత్రమే. శాస్త్రవేత్తల ప్రకారం టీకాలు వేయడం వల్ల టీనేజర్లలో కరోనా కేసులు సగానికి తగ్గాయి. ఇంతకు ముందు కరోనా ఇన్‌ఫెక్షన్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఓమిక్రాన్ కేసులలో 66 శాతం పెరుగుదల ఉందని పరిశోధన పేర్కొంది. పిల్లలకు టీకాలు వేయించాలని శాస్త్రవేత్తలు సూచించారు.

డిసెంబరు 11 వరకు వైరల్ సీక్వెన్సింగ్ డేటా ప్రకారం.. పిల్లలకు కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధన అధ్యయనం ప్రధాన పరిశోధకుడు పాల్ ఎలియట్ చెప్పారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన 650 నమూనాలలో 11 ఓమిక్రాన్‌కు చెందినవి కాగా మిగిలినవి ప్రీ-ఓమిక్రాన్ వేరియంట్ డెల్టాకు చెందినవి. ఈ పరిశోధన అధ్యయనం సమయంలో Omicron కేసులు ప్రతిరోజూ 66 శాతం పెరిగాయి. UKలో Omicron వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ టీకా వేగాన్ని పెంచడం వల్ల ఈ రూపాంతరం పిల్లలకు లేదా పెద్దలకు ప్రాణాంతకం కాదని చెప్పారు.

Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!

RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

PM Modi: వినియోగదారులకు ప్రధాని మోడీ శుభవార్త.. సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్..