Night Curfew: కోరలు చాస్తున్న ఒమ్రికాన్.. రాత్రిపూట కర్ఫ్యూ విధింపు.. మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం!
పెరుగుతున్న కరోనా వైరస్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Madhya Pradesh Night Curfew: పెరుగుతున్న కరోనా వైరస్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన విడుదల చేశారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు రావడంతో శివరాజ్ సర్కార్ కరోనా కట్టడి చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
ఈ అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మధ్యప్రదేశ్‌కు చేరుకుంటున్నారని సీఎం శివరాజ్ తెలిపారు. రెండో వేవ్ కరోనా ఉదాహరిస్తూ, ఆ సమయంలో కూడా మహారాష్ట్రలో కేసులు పెరగడం ప్రారంభించాయని, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో కూడా రెండవ వేవ్ వచ్చాయని అన్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న బాధలను ప్రభుత్వం మరిచిపోలేదని ఆయన అన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఉమిక్రాన్ రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన ఇండోర్, భోపాల్ ను తాకాయి.
పండుగల సీజన్‌లో కరోనా కేసులు మరింత వేగంగా పెరుగుతాయి. క్రిస్మస్,న్యూ ఇయర్ సమయంలో ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించే అవకాశముంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుండి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులపై సీఎం శివరాజ్ సింగ్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి కరోనా యొక్క మూడవ వేవ్ పరిస్థితి సృష్టించబడాలని అతను కోరుకోవడం లేదు. అందుకే ప్రభుత్వం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది.
मध्यप्रदेश की जनता के नाम संदेश। #MPFightsCoronahttps://t.co/rWfvpWLd7z
— Office of Shivraj (@OfficeofSSC) December 23, 2021
నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్‌లో వారానికోసారి కరోనా కేసులు మూడు రెట్లు పెరిగాయని సీఎం శివరాజ్‌సింగ్ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలోని 16 రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అతి త్వరలో ఓమిక్రాన్ వేరియంట్ మధ్యప్రదేశ్‌లో కూడా దూసుకుపోవచ్చని ఆయన అన్నారు. ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ అని ఆయన అన్నారు. అందుకే ముందుజాగ్రత్తగా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
Read Also… CBSE Exams: 10,12వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అందరిని పాస్ చేయాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం!