CBSE Exams: 10,12వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అందరిని పాస్ చేయాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం!
ఇటీవల ఫస్ట్ టర్మ్ పరీక్షలు రాసిన పది, పన్నెండో తరగతి విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుభవార్త చెప్పింది. దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది సీబీఎస్ఈ బోర్డు. టర్మ్ 1 పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ చేయకూడదని నిర్ణయించింది.
CBSE term 1 Exams Results: ఇటీవల ఫస్ట్ టర్మ్ పరీక్షలు రాసిన పది, పన్నెండో తరగతి విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుభవార్త చెప్పింది. దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది సీబీఎస్ఈ బోర్డు. టర్మ్ 1 పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ చేయకూడదని నిర్ణయించింది. అయితే, కేవలం మార్కులు మాత్రమే కేటాయించనున్నట్లు వెల్లడించింది. టర్మ్ 1 బోర్డ్ ఎగ్జామ్స్ సాధారణం కంటే కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగడంతో సీబీఎస్ఈ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, సీబీఎస్ఈ(CBSE) 10, 12వ తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బోర్డ్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ, నూతన విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి సెమిస్టర్ పద్దతిని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతి సంవత్సరం రెండు విడతల్లో టర్మ్ 1, టర్మ్ 2 పద్దతిలో ఈ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల టర్మ్1 పరీక్షలు పూర్తయ్యాయి.
ఈ ఏడాది విద్యార్థులపై కరోనా మహమ్మారి భారీగానే ప్రభావం పడింది. ఆన్‌లైన్ క్లాసులకు తోడు ఈ ఏడాది సెమిస్టర్ విధానం విద్యార్థులకు కొత్త కావడంతో అవగాహన లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు, పేపర్లు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వారి ఆందోళనకు తలొగ్గిన సీబీఎస్బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏ విద్యార్థిని ఫెయిల్ చేయకుండా చూడాలని బోర్డు ఆదేశించింది. బోర్డు ప్రకారం, టర్మ్ 1 బోర్డు పరీక్ష ఫలితాల్లో మార్కులు మాత్రమే ఉంటాయి. విద్యార్థులకు పాస్, ఫెయిల్, రిపీటర్ లేదా కంపార్ట్‌మెంట్ గ్రేడ్‌లను కేటాయించదు. అయితే, టర్మ్–2 పరీక్షలు ముగిసిన తర్వాత మాత్రం పాస్ లేదా ఫెయిల్ మెరిట్ జాబితాను రిలీజ్ చేయాలని బోర్డు సూచించింది. టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ఎవల్యూషన్స్కోర్ల ఆధారంగా తుది ఫలితాన్ని ప్రకటిస్తుంది.
CBSE టర్మ్ 1 బోర్డ్ పరీక్ష ఫలితాలు త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. CBSE 10వ తరగతి,12వ తరగతి టర్మ్ 1 బోర్డ్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లేదా cbseresults.nicలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. CBSE బోర్డ్ 10, 12 తరగతుల ఫలితాలు జనవరి 2022 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, CBSE టర్మ్ 1 బోర్డ్ ఫలితాలకు సంబంధించి బోర్డు ఎటువంటి నిర్ణీత తేదీ మరియు సమయాన్ని ప్రకటించలేదు. CBSE టర్మ్ 1 ప్రధాన పరీక్షలు డిసెంబర్ 22న ముగిశాయి. ఇంకా, కొన్ని వొకేషనల్ సబ్జెక్ట్ పరీక్షలు డిసెంబర్ 29 నాటికి ముగుస్తాయి.
సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘బోర్డు తాజా నిర్ణయం దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చింది. దీని ద్వారా పరీక్షలలో విఫలమయ్యే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే మొదటి టర్మ్ తర్వాత కేవలం మార్కులు మాత్రమే తెలియజేస్తే విద్యార్థులు తమను తాము బాగా విశ్లేషించుకోగలుగుతారు. వారు రెండవ టర్మ్‌కు ఎలా సిద్ధం కావాలో సులభంగా తెలుసుకుంటారు.” అని పేర్కొన్నారు.
మరోవైపు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్గదర్శకాలను కూడా సీబీఎస్ఈ అన్ని పాఠశాలలు, కాలేజీలకు అందించింది. పదో తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్ పార్ట్‌లో మూడు పీరియాడిక్ అసెస్మెంట్లు, స్టూడెంట్ ఎన్‌రిచ్‌మెంట్ పోర్ట్‌ఫోలియో, ప్రాక్టికల్ వర్క్, స్పీకింగ్ అండ్ లిజనింగ్ యాక్టివిటీల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు. ఇక, 12వ తరగతి ఇంటర్నల్ ఎవల్యూషన్లో యూనిట్ టెస్ట్‌లు, ఎక్స్ప్లరేటరీ యాక్టివిటీస్; ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్‌ల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు. సీబీఎస్ఈ టర్మ్–2 పరీక్షలను 2022 మార్చి నుంచి ఏప్రిల్ మధ్య నిర్వహించే అవకాశం ఉంది.