Omicron: దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు.. విద్యార్థుల్లో ఆందోళన..!

Omicron: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికే తగ్గడం లేదు. కరోనా కట్టడికి గతంలో లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలతో ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పట్టింది...

Omicron: దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు.. విద్యార్థుల్లో ఆందోళన..!
తూర్పు మద్య దేశాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య గతం వారంతో పోలిస్తే సమానంగా ఉంది. అటు ఆఫ్రికన్ ప్రాంతంలో మాత్రం మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏకంగా 72 శాతం మరణాలు సంభవించాయి. అటు దక్షిణ తూర్పు ఆసియాలో 9 శాతం మరణాలుంటే..అమెరికా ప్రాంతంలో 7 శాతం మరణాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల కోవిడ్ కేసులుంటే..5.4 మిలియన్ల మంది మరణించారు.
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2021 | 8:49 AM

Omicron: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికే తగ్గడం లేదు. కరోనా కట్టడికి గతంలో లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలతో ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడు ఎవరి పనులు యధావిధిగా చేసుకుంటున్న సమయంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్‌ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపిస్తోంది. ఇక భారత్‌లో కూడా మెల్లమెల్లగా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. మళ్లీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్టి పీడిస్తుండటంతో భయాందోళన నెలకొంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఒమిక్రాన్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు చేపట్టే విధంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. వైరస్‌ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తోంది. ఢిల్లీలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించింది. అలాగే ముంబైలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్‌ విధించారు. గుజరాత్‌లోని 9 నగరాల్లో నైట్‌ కర్ప్యూ విధించనున్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా నైట్‌ కర్ఫ్యూ అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్ణాటక రాష్ట్రంలో సామూహిక వేడుకలు రద్దు చేసింది ప్రభుత్వం. ఉత్తరప్రేదశ్‌లో ఈనెల 31 వరకు 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకువచ్చారు. కేరళ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచనలు చేశారు. సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని సూచిస్తోంది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు ఉన్నందున ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో ముప్పు రాకముందే రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందా..? కరోనా మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వచ్చి మరింత ఆందోళకు గురి చేస్తోంది. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా..? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. కొత్త వేరియంట్‌ వల్ల జీవనోపాధి దెబ్బతిస్తుందని భయాందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 100 శాతం వ్యాక్సినేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది.

మళ్లీ స్కూళ్లు మూతపడతాయా..? కరోనా కారణంగా విద్యాసంస్థలన్ని మూతపడి ప్రస్తుతం తెరుచుకున్న సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్కూళ్లపై ప్రభావం చూపుతుందేమోనన్న భయాందోళన నెలకొంది. ఇప్పటికే విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురైనా నేపథ్యంలో మళ్లీ స్కూళ్లు మూతపడతాయోమోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

మాస్క్‌ తప్పనిసరి: కొత్త వేరియంట్‌ దేశంలో విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకుంటే కొత్త వేరియంట్‌ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం వల్ల ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు. గతంలో కరోనా నిబంధనలు పాటించినట్లుగానే ఇప్పుడు కూడా పాటించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Covid Vaccine: బూస్టర్ డోస్‌లకు బదులు దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌లకే ప్రాధాన్యత.. సూచిస్తున్న నిపుణులు

Omicron Cases: తెలంగాణలో పంజా విసురుతోన్న ఒమిక్రాన్‌.. అక్కడ పది రోజుల పాటు లాక్‌డౌన్‌..

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!