Google Searched Recipes: భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వంటకాలు ఇవే..!
Google Searched Recipes: ఏదైనా వెతకాలంటే గూగుల్ ఉండనే ఉంది. ఏ పదాలు కావాలన్నా ముందుగా గూగుల్‌నే ఎంచుకుంటారు. అయితే గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన..
Google Searched Recipes: ఏదైనా వెతకాలంటే గూగుల్ ఉండనే ఉంది. ఏ పదాలు కావాలన్నా ముందుగా గూగుల్‌నే ఎంచుకుంటారు. అయితే గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలను గూగుల్ వెల్లడించింది. ఇక 2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల జాబితాలో వంటకాలు, వ్యక్తిగత, టీవీ కార్యక్రమాలు, సినిమాల పేర్లను గూగుల్ (Google) విడుదల చేసింది. ఇక భారతదేశంలో ప్రజలు ఐదు వంటకాల పేర్లను గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గుర్తించింది.
పుట్ట గొడుగులు: 2021లో భారతదేశంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వంటకాల పేర్లను సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో మష్రూమ్ వంటకం అగ్రస్థానంలో నిలిచింది. మణిపూర్‌లో ఈ వంటకాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ వంటకాన్ని సెర్చ్ చేసిన రెండోవ రాష్ట్రం మిజోరాం, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, బీహార్ వరుసగా మూడు , నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి.
మోదక్ : ఈ మోదక్ అనేది వినాయక చవితి రోజు తీపి వంటకాలలో ఇదొకటి. గణేష్ చతుర్థి వేడుకలలో దీనిని ప్రసాదంగా అందిస్తుంటారు. భారతదేశంలో ఈ రెసిపీని ఐదు ప్రదేశాలలో ఎక్కువగా సెర్చ్ చేశారు. వరుసగా గోవా, మహారాష్ట్ర, దాద్ర నగర్ హవేలీ, పశ్చిమబెంగాల్, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయని గూగుల్ వెల్లడించింది.
మేతి మంటన్ మలై: మేతి మటన్ మలై వంటకాన్ని కూడా గూగుల్‌లో చాలా మంది సెర్చ్ చేశారు. భాఏత్‌లో ఇది ట్రెండింగ్‌లో ఉంది. మేతి మటన్ అనేది మెంతి ఆకులు, బటానీలు, క్రీమ్‌తో తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. మేతి మటన్ మలై వంటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా సెర్చ్ చేశారు. తర్వాత చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు.
పాలక్.. పాలక్ ఆంగ్లంలో స్పినాచ్ అని పిలుస్తారు. భారత ప్రజలు ఎక్కువగా తినే ఆహారం ఇది. ఈ వంటకం బఠానీలు, జున్ను మొదలైన పదార్థాలను కలిపి వంటకాన్ని తయారు చేస్తారు. పాలక్ రెసిపీ అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన జాబితాలో భారత్ ఉంది. ఇది భారతదేశంలోని డామన్ డయ్యులో ఎక్కువగా శోధించారు. గూగుల్ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ఈ వంటకం గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
చికెన్ సూప్.. చికెన్ సూప్ గూగుల్‌లో అత్యధికంగా శోధించన వంటకం ఇది. చికెన్ సూప్ అనేది చికెన్, నీరు, రుచికి అనుగుణంగా అనేక పదార్థాలతో తయారు చేస్తారు. గోవా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటివి గూగుల్‌లో డిష్ రెసిపీని సెర్చ్ చేసిన అగ్ర రాష్ట్రాలు ఇవి ఉన్నాయి. కాగా, 2021లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో మరికొన్ని..
2021 గూగుల్లో సెర్చ్ చేసిన పదాలు మరికొన్ని..
వ్యక్తుల పేర్లు: 1. నీరజ్ చోప్రా 2. ఆర్యన్ ఖాన్ 3. షెహనాజ్ గిల్ 4. రాజ్ కుంద్రా 5. ఎలన్ మాస్క్
అత్యధికంగా సెర్చ్ చేసిన ఘటనలు: 1. టోక్యో ఒలింపిక్స్ 2. బ్లాక్ ఫంగస్ 3. అప్ఘన్ వార్తలు 4. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 5. తౌక్టే తుఫాను
అత్యధికంగా సెర్చ్ చేసిన స్పోర్ట్స్, కోవిన్.. 1. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2. కోవిన్ 3. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 4. యూరో కప్ 5. టోక్యో ఒలింపిక్స్
అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలు 1. జై భీమ్ 2. షేర్షా 3. రాధే 4.బెల్‌బాటమ్ 5. ఎటర్నల్స్
ఇవి కూడా చదవండి: