Aadhaar Update: ఆధార్‌లో మీ పుట్టిన తేదీ తప్పుగా ఉందా..? మార్చుకోండిలా..!

Aadhaar Update: ప్రస్తుతం ఆధార్‌ ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాల పనుల నుంచి చిన్న చిన్న పనుల వరకు జరుగుతాయి...

Aadhaar Update: ఆధార్‌లో మీ పుట్టిన తేదీ తప్పుగా ఉందా..? మార్చుకోండిలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 22, 2021 | 11:33 AM

Aadhaar Update: ప్రస్తుతం ఆధార్‌ ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాల పనుల నుంచి చిన్న చిన్న పనుల వరకు జరుగుతాయి. లేకుంటే నిలిచిపోతాయి. అయితే మీ ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పుగా ఉన్నాయా..? అయితే ఎలాంటి టెన్షన్‌ పడనక్కరలేదు. ప్రస్తుతం ఆధార్‌లో వివరాలన్ని సరైనవిగా ఉంటేనే పనులు జరుగుతాయి. లేకపోతే ఏ పనులు జరగవు. మీరు బ్యాంకు అకౌంట్‌ తీయాలన్నా.. పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా.. ఇంకా చాలా పనులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఇబ్బందులే. అలాగే కేవైసీ విషయంలో పుట్టిన తేదీ కూడా ముఖ్యమైనదే. అయితే ఆధార్‌ కార్డులో ఈ వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంది. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే పుట్టిన తేదీ మార్చుకునే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అవకాశం కల్పిస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది పనులు మరింత సులభతరం అవుతున్నాయి. మరి ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోండి. అయితే మీ ఆధార్‌కు మీ మొబైల్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి.

ఆధార్‌లో పేరు మార్చుకోండిలా.. ➦ ఆధార్ కార్డు హోల్డర్లు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ https://ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయాలి. ➦ Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. ➦ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➦ క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ➦ Sent OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ➦ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. ➦ మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ➦ అందులో పుట్టిన తేదీని మార్చాలి. ➦ యూఐడీఐఏ సూచించిన ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ➦ ఏ డాక్యుమెంట్స్‌ని యూఐడీఐఏ అనుమతి ఇస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ➦ ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత Submit పైన క్లిక్ చేయాలి. ➦ మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని పరిశీలించి యూఐడీఏఐ మీ పుట్టిన తేదీని, ఇతర వివరాలను సరిచేస్తుంది. మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

రిక్వెస్ట్‌ స్టేటస్‌ తెలుసుకోవడం ఎలా..? ► https://ssup.uidai.gov.in/ssup/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ► Check Update Status పైన క్లిక్ చేయండి. ► ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయండి. ► మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. ► Check Status పైన క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుస్తుంది.

Aadhaar Portal

ఇవి కూడా చదవండి:

Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?

LIC Jeevan Umang Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రూ.44 పెట్టుబడితో 27 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!