National Mathematics Day: అపర మేధావికి అరుదైన గుర్తింపు.. నేడు జాతీయ గణిత దినోత్సవం
National Mathematics Day: సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుతమైన కానుక అందించారు. సున్నా ఆవిష్కరణతో గణిత శాస్త్రం గొప్ప ప్రాధాన్యత..
National Mathematics Day: సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుతమైన కానుక అందించారు. సున్నా ఆవిష్కరణతో గణిత శాస్త్రం గొప్ప ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అయితే దశాంశ పద్దతిని గుర్తించింది భారతీయులే కావడం విశేషం. భారతీయ గణిత చరిత్రకు శ్రీనివాస రామానుజ మెరుగులు దిద్దారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
అపర మేధావి అయిన రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. తన పన్నెండేళ్ల వయసులోనే గణితంలో రామానుజన్ మంచి గుర్తింపు పొందారు. 1903లో కుంబకోణంలోని ప్రభుత్వ కళాశాలలో చేరారు. అయితే గణితంపై మాత్రమ ఆసక్తి చూపేవాడు. దీంతో మ్యాథ్స్ మినహా అన్ని పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 1903లో మద్రరాస్ విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్ షిప్ పొందారు.
లెక్కల వల్ల కొడుకుకు పిచ్చిపట్టిందేమోనని రామానుజన్ తండ్రి ఆయనకు వివాహం చేశాడు. దీంతో 1912లో మద్రాస్ పోర్ట్ ట్రస్టులో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు.అప్పుడు ఆయన జీతం రూ.25 మాత్రమే. గణితంలో ఆయన ప్రతిభను చూసి ఏ డిగ్రీ లేకపోయినప్పటికీ మద్రాస్ విశ్వవిద్యాలయం నెలకు రూ.75 ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ కు వచ్చిన ప్రసిద్ద గణిత శాస్త్రవేత్త హకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను కేంబ్రిడ్జి ఫ్రొఫెస్ జీహెచ్ హార్డికి పంపారు. వాటిని పరిశీలించిన హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్సిటీకి ఆహ్వానించారు. దీంతో 1914, మార్చి 17న రామానుజన్ ఇంగ్లండ్‌కు పయణమయ్యాడు.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందే ట్రినిటీ కళాశాలలో చేరారు. 1916లో బీఎస్సీ పూర్తి చేశారు.1917లో లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి ఎంపికయ్యారు. 1918, ఫిబ్రవరి 28న ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీకి గౌరవం దక్కింది. ఈ గుర్తింపు పొందిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ పురస్కారం అందుకున్నారు. ఈ గౌరవం అందుకున్న మొదటి భారతయుడు రామానుజన్ కావడం విశేషం. 1729ని రామానుజన్ సంఖ్య అంటారు.
కాగా, రామానుజన్ అనారోగ్య సమస్యలతో 1919 మార్చిలో భారత్‌కు తిరిగి వచ్చారు. తన 32 ఏళ్ల వయసులోనే 1926 ఏప్రిల్ 26న క్షయ వాధితో తుదిశ్వాస విడిచారు. గణిత శాస్త్రంలో ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజున జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. అలాగే రామానుజన్ 75వ జన్మదినోత్సం సందర్భంగా 1962లో కేంద్ర సర్కార్ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఆయన జీవిత ఆధారంగా ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ పేరుతో సినిమా కూడా విడుదలైంది.
ఇవి కూడా చదవండి: