AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastag: ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారా? ఇకపై దానిని రీఛార్జ్ చేయకుండా రోడ్డు మీదకు వస్తే చలానా బాదుడు తప్పదు!

ఇప్పటి వరకు, దేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు మాత్రమే వాహనాలపై చలానా వేస్తూ వస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో, FASTag రీఛార్జ్ చేయకపోయినా కూడా వాహనానికి చలానా వేసే అవకాశం ఉంది.

Fastag: ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారా? ఇకపై దానిని రీఛార్జ్ చేయకుండా రోడ్డు మీదకు వస్తే చలానా బాదుడు తప్పదు!
Fastag
KVD Varma
|

Updated on: Dec 22, 2021 | 8:57 AM

Share

Fastag: ఇప్పటి వరకు, దేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు మాత్రమే వాహనాలపై చలానా వేస్తూ వస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో, FASTag రీఛార్జ్ చేయకపోయినా కూడా వాహనానికి చలానా వేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా టోల్ బ్లాక్‌లను తొలగించే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తోంది. కొత్త విధానంలో, కదిలే వాహనం నుంచి మాత్రమే టోల్ వసూలు జరుగుతుంది. ఇందుకోసం NHAI, రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ కలిసి నిబంధనలను రూపొందిస్తున్నాయి. దీని ముసాయిదా ఇప్పటికే సిద్ధమైంది.

ఈ కొత్త పథకం పూర్తయిన తర్వాత, వాహనం ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా లేదా రుసుము చెల్లించకుండా ప్రయాణిస్తే, దానిపై చలానా పడుతుంది. వాహనం చలానా పదేపదే వస్తే కనుక.. దాని RC బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఈ ప్రతిపాదిత నియమం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. భవిష్యత్తులో ఇది అమలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ముందుగా..

ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభిస్తే, ముందుగా ఈ వ్యవస్థ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో అమలు చేస్తారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఆధునిక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దేశంలోని ఇతర జాతీయ రహదారులపై కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్యవస్థ అభిప్రాయం ప్రారంభ దశలో తీసుకుంటారు. అభిప్రాయాల్లో ఇబ్బందులను తొలగించి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం ఉంది.

మొబైల్‌కు సమాచారం..

టోల్ పాయింట్ల వద్ద అమర్చిన ఈ అల్ట్రా-ఆధునిక కెమెరాల సహాయంతో, కదిలే వాహనం నంబర్ ప్లేట్.. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా దూరాన్ని బట్టి టోల్ మొత్తం అటోమేటిక్ గా వసూలు చేస్తారు. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా వాహనం వెళితే, దాని ఫుటేజీ కెమెరాలో బంధితం అవుతుంది. దీని ఆధారంగా, జరిమానా..చలానా గురించిన సమాచారం వాహన యజమానికి మొబైల్‌లో వెళుతుంది. ఈ మొత్తం వ్యవస్థ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇందులో ఎలాంటి పత్రాలు అవసరం లేదు. దీంతో టోల్ వసూళ్లు పారదర్శకంగా జరగడంతోపాటు జాతీయ రహదారి ఆదాయాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

జరిమానా చెల్లించకుంటే ఫాస్ట్ ట్యాగ్ కంపెనీ నోటీసులు పంపుతుంది. దీని కాపీ స్వయంచాలకంగా NHA, రవాణా శాఖ వ్యవస్థకు చేరుతుంది. వాహన యజమాని చలాన్‌కు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తే, కెమెరా ఫుటేజీ ఆధారంగా, వాహన యజమానికి జరిమానా విధిస్తారు.

ఫాస్ట్‌ట్యాగ్ ఆన్‌లైన్ రీఛార్జ్ ఇలా..

ఫాస్ట్‌ట్యాగ్‌ని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయడం సులభం. దీని కోసం మీరు బ్యాంక్ ఖాతాతో పాటు ఆన్‌లైన్ పేమెంట్ వాలెట్‌ను ఉపయోగించవచ్చు. మీ మొబైల్‌లో Paytm ఉంటే మీరు ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు Axis బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, ICICI బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ FASTag రీఛార్జ్, IndusInd బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ తీసుకున్నట్లయితే, మీరు Paytm నుండి ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోగలరు.

ఎలా రీఛార్జ్ చేయాలి

  • Paytmలో ఫాస్టాగ్ రీఛార్జ్ ఎంపికకు వెళ్లండి
  • ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంకును ఎంచుకోండి
  • వాహనం నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి
  • ఇప్పుడు ప్రొసీడ్‌పై క్లిక్ చేసి రీఛార్జ్ మొత్తాన్ని నమోదు చేయండి
  • మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, Paytm వాలెట్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు