Smart TV: కొత్త స్మార్ట్‌టీవీ ఎందుకు దండగ.. మీ పాత టీవీనే మార్చేయండి స్మార్ట్‌గా..
మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న టీవీ ఇప్పటికీ సరిగానే పనిచేస్తోంది. ఇలాంటప్పుడు మీరు ఖరీదైన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం కంటే.. మీ ప్రస్తుత టీవీని స్మార్ట్ టీవీగా మార్చడం మంచిది.

Smart TV: మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న టీవీ ఇప్పటికీ సరిగానే పనిచేస్తోంది. ఇలాంటప్పుడు మీరు ఖరీదైన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం కంటే.. మీ ప్రస్తుత టీవీని స్మార్ట్ టీవీగా మార్చడం మంచిది. ఎందుకంటే, తక్కువ ఖర్చుతో మీ టీవీని స్మార్ట్ గా మార్చేసే అవకాశం ఇప్పుడుంది. దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. మీరు మీ టీవీని స్మార్ట్ గా మార్చుకోవాలంటే.. మీ టీవీలో HDMI పోర్ట్ ఉండాలి అనే విషయం గుర్తుంచుకోండి.
మీ టీవీలో స్మార్ట్ టీవీ వంటి ఫీచర్‌లను పొందడానికి, మీకు మీడియా స్ట్రీమింగ్ పరికరం అవసరం. మార్కెట్‌లో అనేక మీడియా స్ట్రీమింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ. 1500 నుంచి రూ. 20000 బడ్జెట్‌లో వస్తాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం…
Chromecast
గూగుల్ క్రోమ్ కాస్ట్(Google Chromecast) అనేది మీ టీవీలో బాగా పని చేసే మీడియా స్ట్రీమింగ్ పరికరం. ఇది Google ఉత్పత్తి. అందువల్ల ఇది Google అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. అవన్నీ ఆండ్రాయిడ్‌కి అనుకూలంగా ఉంటాయి. దీని సహాయంతో, మీరు అన్ని OTT యాప్‌లను ఆస్వాదించవచ్చు అలాగే మీరు మీ టీవీలో మీ ఫోన్ గ్యాలరీని కూడా చూసే అవకాశం ఉంటుంది. మీరు Chromecastలో 2000 కంటే ఎక్కువ యాప్‌లు, HD నాణ్యత వీడియో స్ట్రీమింగ్ ఎంపికను కూడా దీని ద్వారా పొందగలుగుతారు.
Amazon Fire TV Stick
Google తరువాత రెండవ గొప్ప ఎంపిక Amazon నుంచి వచ్చిన Fire TV Stick. ఇది రూ.2500 నుంచి రూ.5999 వరకు ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది. Amazon Fire TV Stick అన్ని మోడల్‌లు రిమోట్‌తో వస్తాయి. దీనితో మీరు టీవీని రిమోట్‌తో నియంత్రించవచ్చు.
ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ అన్ని సేవల వంటి ఫీచర్లు ఇందులో అంతర్నిర్మితంగా అందుబాటులో ఉన్నాయి. ఇది పిల్లల కోసం చాలా గేమ్స్ కూడా అందిస్తుంది. దీని రిమోట్‌తో కూడా ప్లే చేయవచ్చు. Amazon కు చెందిన Alexa వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా Fire TV స్టిక్‌తో వస్తుంది. Fire TVలో మీరు కోరుకునే అన్ని OTT యాప్‌లు అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి: Taliban in Afghanistan: పొరపాటున వేరేవారికి లక్షలాది డాలర్లు పంపేసిన తాలిబన్లు.. తిరిగి ఇమ్మంటే నో అంటున్న అవతలి దేశం!