Taliban in Afghanistan: పొరపాటున వేరేవారికి లక్షలాది డాలర్లు పంపేసిన తాలిబన్లు.. తిరిగి ఇమ్మంటే నో అంటున్న అవతలి దేశం!
మూలిగే నక్క మీద తాటిపండు అంటే ఇదే. ఆఫ్ఘనిస్తాన్ పాలన కైవసం చేసుకున్న తాలిబన్లు చేసిన ఒక పొరపాటు వాళ్లకు కోట్లాది రూపాయల నష్టాన్ని తెచ్చింది.
Taliban in Afghanistan: మూలిగే నక్క మీద తాటిపండు అంటే ఇదే. ఆఫ్ఘనిస్తాన్ పాలన కైవసం చేసుకున్న తాలిబన్లు చేసిన ఒక పొరపాటు వాళ్లకు కోట్లాది రూపాయల నష్టాన్ని తెచ్చింది. తాలిబన్లు సెప్టెంబర్‌లో తజికిస్థాన్‌లోని తమ రాయబార కార్యాలయం ఖాతాకు 8,00,000 డాలర్లని పొరపాటుగా బదిలీ చేశారు. తప్పు తెలుసుకున్న తాలిబన్లు డబ్బును తిరిగి ఇవ్వమని కోరగా, దానిని తిరిగి ఇవ్వడానికి తజకిస్తాన్ రాయబార కార్యాలయం నిరాకరించింది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో తజికిస్థాన్‌కు రాయబారిగా నియమితుడైన మహ్మద్ జహీర్ ఈ విషయంపై మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాలు.. ఖర్చుల బకాయిల కింద ఈ డబ్బును ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఈ డబ్బును ఆఫ్ఘన్ ఎంబసీ ఖాతాకు పంపవలసి ఉంది. కానీ తాలిబాన్ స్వాధీనం తర్వాత, అష్రఫ్ ఘనీ దేశం విడిచిపెట్టారు. దీంతో పరిస్థితి మారిపోయింది. మేము తాలిబాన్‌లకు డబ్బును తిరిగి ఇవ్వలేము, ఈ డబ్బు ఎంబసీ అవసరానికి అనుగుణంగా ఖర్చు చేశాం. తజికిస్తాన్‌లోని శరణార్థి పిల్లల కోసం పాఠశాలలో దీనిని ఉపయోగించాల్సి ఉంది అంటూ ఆయన వివరించారు.
తాజిక్ అధికారుల తిరస్కరణ
ఎంబసీ ఖాతాకు కేవలం 4,00,000 డాలర్లు మాత్రమే బదిలీ చేశారని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మొదట్లో, తాలిబాన్ ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదు. కానీ నవంబర్‌లో, దేశంలో పరిస్థితి చాలా ఘోరంగా మారినప్పుడు, డబ్బు తిరిగి అడగడానికి తజికిస్తాన్‌ను సంప్రదించారు. తాలిబాన్ డబ్బును తిరిగి ఇవ్వమని కోరినప్పుడు, తజిక్ అధికారులు దానిని సున్నితంగా తిరస్కరించారు.
తాలిబాన్ తీవ్రవాద సంస్థ
ఆఫ్ఘన్ ఎంబసీ ఒక ప్రకటనలో ఈ డబ్బును ఎంబసీలోని ఉద్యోగులకు ఇస్తున్నారు. మొత్తం డబ్బు ఎంబసీ..ఆఫ్ఘనిస్తాన్ పౌరుల అవసరాలను తీర్చడానికి ఖర్చు చేస్తున్నాము. తజికిస్థాన్ ప్రభుత్వం తాలిబాన్‌కు గట్టి వ్యతిరేకి. దానిని ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఏ ఉగ్రవాద సంస్థ ఖాతాకు డబ్బు పంపడం అనేది జరగదు అని పకటించింది.
ఈ నిర్ణయం ఆఫ్ఘనిస్తాన్‌లో పేదరికం.. ఆకలితో అన్ని రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్న తాలిబాన్ పాలనకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం, ఆఫ్ఘనిస్తాన్‌లో పేదరికం.. ఆకలి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కు విదేశీ సహాయాన్ని కూడా నిలిపివేసాయి. మామూలుగానే పేదరికం.. కరువును ఎదుర్కొంటున్న ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితులు తాలిబాన్ ఆక్రమణ తర్వాత మరింత దిగజారాయి.
ఇవి కూడా చదవండి: Smart Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త సంవత్సరంలో సంచలనం సృష్టించనున్న ఫోన్‌లు ఇవే!
Adar Poonawalla: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం వైపు సీరమ్ అధినేత చూపు.. ‘వాకౌ’లో 20 శాతం వాటా కొనుగోలు!
Amla Benefits: ఉసిరిని ఇలా తీసుకుంటే అద్భుతమైన రుచి.. అంతకు మించిన ఆరోగ్యం..