సూర్యుడు మబ్బుల చాటున దక్కునాడా.. తడి బట్టలు ఆరబెట్టడానికి ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి
శీతాకాలంలో ఎండ వేడి తక్కువగా ఉంటుంది. పొగమంచు మాత్రమే కాదు గత కొన్ని రోజులుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో సూర్యుడు ముఖం చాటేశాడు. ఈ నేపధ్యంలో ఉతికిన దుస్తులు ఆరబెట్టడం ఒక పెద్ద టాస్క్ గా మారుతుంది. ఎదుకంటే పొగమంచు కారణంగా సూర్యకాంతి తక్కుగా ఉంటుదని. దీని కారణంగా బట్టలు కూడా ఆరవు. అయితే తడి బట్టలను కొన్ని చిట్కాలతో సూర్యకాంతి లేకుండా ఆరబెట్టవచ్చు.
శీతాకాలంలో సూర్యుడు మబ్బుల మాటున దాక్కుంటాడు. పొగ మంచు, చల్లని గాలులు వాతావరణాన్ని మరింత చల్లగా చేస్తాయి. ఇలాంటి వాతావరణంలో తడి బట్టలు ఆరబెట్టడం అతిపెద్ద సవాలుగా మారుతుంది. బట్టలు ఉతకడం చాలా తేలికైనప్పటికీ సూర్యరశ్మి లేకుండా వాటిని త్వరగా, చల్లదనం లేకుండా ఆరబెట్టడం చాలా కష్టమైన పని. బట్టలు సరిగ్గా ఆరకపోతే దుర్వాసన వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల శీతాకాలంలో దుస్తులను తడి దనం లేకుండా ఆరబెట్టడం చాలా ముఖ్యం.
సూర్యరశ్మి లేకపోవడం వల్ల బట్టలు చాలా రోజులు తడిగా ఉంటే.. వాటిని ఎలా ఆరబెట్టాలి అని మీరు ఆందోళన చెందుతుంటే.. చింతించకండి. ఈ రోజు సూర్యరశ్మి లేకుండా బట్టలు త్వరగా, సురక్షితంగా ఆరబెట్టడంలో సహాయపడే సింపుల్ టిప్స్ ను తెలుసుకుందాం.. ఈ టిప్స్ శీతాకాలం, రుతుపవనాలు లేదా వాతారణం పొడిగా ఉన్నా సరే ఉపయోగకరంగా ఉంటాయి. సూర్యకాంతి లేకుండా బట్టలు ఆరబెట్టడానికి సింపుల్ టిప్స్ ..
గది హీటర్ లేదా బ్లోవర్ ని ఉపయోగించండి.
సూర్య రశ్మి రాకపోయినా మీరు మీ తడి బట్టలు ఆరబెట్టాలనుకుంటే.. గది హీటర్ లేదా బ్లోవర్‌ని ఉపయోగించవచ్చు. అవును గదిలో ఒక రూమ్ హీటర్ లేదా బ్లోవర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అప్పుడు తడి బట్టలు వాటి దగ్గర ఉంచి వాటిని ఆరబెట్టవచ్చు. ఇది బట్టలకు వెచ్చదనాన్ని అందించడంతో బట్టలు సరిగ్గా ఆరిపోతాయి. అయితే రూమ్ హీటర్‌కు మరీ దగ్గరగా బట్టలు ఉంచ కూడదు అని గుర్తుంచుకోండి, ఎందుకంటే అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
ఫోల్డబుల్ డ్రైయర్ స్టాండ్.
సూర్యకాంతి లేకుండా బట్టలు ఆరబెట్టడానికి మరొక ఉపాయాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇంటి లోపల బట్టలు ఆరబెట్టడానికి ఫోల్డబుల్ డ్రైయర్ స్టాండ్‌ని ఉపయోగించండి. కిటికీ లేదా బాల్కనీ దగ్గర గాలి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ స్టాండ్‌ని ఉంచండి. దీని మీద తడి బట్టలు వేసి ఆరబెట్టడం వలన బట్టలు సూర్యరశ్మి లేకపోయినా కేవలం గాలి తగిలి ఆరిపోతాయి.
జుట్టు ఆరబెట్టే హెయిర్ డ్రైయర్
బట్టలు తడి పొడిగా ఉంటే అప్పుడు వాటిని హెయిర్ డ్రైయర్ సహాయంతో ఆరబెట్టవచ్చు. తడి జుట్టును ఆరబెట్టినట్లే.. తడి పొడిగా ఉన్న బట్టలను కూడా అదే విధంగా ఆరబెట్టండి. హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే వేడి బట్టలకు తగిలిన తర్వాత అవి పూర్తిగా ఆరిపోతాయి.
బట్టలకు ఐరెన్
తడి బట్టలు కొద్దిగా ఆరిన తర్వాత వాటిని ఇస్త్రీ చేయండి. ఇస్త్రీ చేయడం వల్ల బట్టల్లోని తేమ త్వరగా తొలగిపోతుంది. అయితే ఐరన్ చేసేందుకు అనుకూలంగా ఉండే బట్టలపై మాత్రమే ఈ ట్రిక్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.