Burj Khalifa: బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మరి మానవ వ్యర్థాల పరిస్థితి ఏంటి?

Burj Khalifa: మనం ఏదైనా భవనం నిర్మించుకుంటే అందులో ముఖ్యమైనది డ్రైనేజీ వ్యవస్థ. ఇది లేకుండా ఏ భవనం నిర్మించలేము. సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి ఇతర మురుగు కాలువ వ్యవస్థను ఏర్పాటుకు ప్రత్యేక సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తాం. కానీ ప్రపంచంలో పేరొంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌కు ఎలాంటి సెప్టెక్‌ ట్యాంకులు, మురుగు నీటి వ్యవస్థలు లేవు.. మరి ఆ భవనంలోని వ్యవర్థాల పరిస్థితి ఏంటి?

Burj Khalifa: బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మరి మానవ వ్యర్థాల పరిస్థితి ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 27, 2024 | 5:04 PM

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా అనేది మనందరికీ తెలిసిన భవనం. దుబాయ్ యుఎఇలో ఉన్న బుర్జ్ ఖలీఫా విలాసవంతమైనది. 2010లో నిర్మించిన ఈ 160 అంతస్తుల భవనం అత్యంత ఎత్తైనది. 828 మీటర్ల బుర్జ్ ఖలీఫా నిర్మాణం సెప్టెంబర్ 21, 2004న ప్రారంభమైంది. బుర్జ్ ఖలీఫా ఆరేళ్ల తర్వాత జనవరి 4, 2010న పూర్తయి ప్రారంభించారు. ఈ భవనం 95 కి.మీ దూరం నుండి చూడవచ్చు. ఇన్ని విశేషాలతో కూడిన బుర్జ్ ఖలీఫాలో మరో విశేషం ఉంది. ఈ భవనంలో మురుగునీటి వ్యవస్థ అస్సలు లేదు. అంటే ఈ భవనంలో ఎలాంటి సెప్టిక్ ట్యాంకులు లేవు. మరి ఈ భవనంలోని నివాసితులు బాత్రూమ్‌కు వెళ్లలేరా? ఇక్కడి మానవ వ్యర్థాలతోపాటు మురుగు నీరు, ఇతర వ్యర్థాల పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

బుర్జ్ ఖలీఫా భవనమే కాదు.. ప్రపంచంలోని అత్యంత అధునాతన నగరాల్లో ఒకటైన దుబాయ్‌లోని అనేక గొప్ప భవనాలలో సెప్టిక్ ట్యాంకులు లేవు. సాధారణంగా దుబాయ్‌లోని భవనాలు ప్రభుత్వ మురుగు కాలువలకు అనుసంధానించబడి ఉంటాయి. మరుగుదొడ్లలోని వ్యర్థాలను ఇలా తొలగిస్తారు. అయితే, బుర్జ్ ఖలీఫాతో సహా దుబాయ్‌లోని చాలా పెద్ద భవనాలు ఈ విధంగా మురుగు కాలువలకు అనుసంధానించలేదు. అందుకే సెప్టిక్ ట్యాంకులు లేవు. మరీ బుర్జ్ ఖలీఫా టాయిలెట్ల నుండి వ్యవర్థాలను ఎలా తొలగిస్తారు?

ఈ వ్యర్థాలను ట్రక్కుల ద్వారా తొలగిస్తారు. ప్రతిరోజూ, అనేక ట్రక్కులు వీటిని సేకరించి, పారవేయడం కోసం పట్టణం నుండి బయటకు తీసుకువెళతాయి. ఇది కేవలం ఎడారిలో పారవేయరు. అటువంటి వ్యర్థాలను పారవేసే ప్రదేశం పట్టణం వెలుపల ఉంది. ఇక్కడే ట్రక్కులు ఈ చెత్తను తీసుకెళ్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని అనాటమీ ఆఫ్ ఎ స్కైస్క్రాపర్ అనే పుస్తక రచయిత కేట్ ఆస్చెర్ వెల్లడించారు. NPRకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాతో సహా అనేక భవనాలు తమ టాయిలెట్లలో వ్యర్థాలను పారవేస్తాయని అన్నారు. బుర్జ్ ఖలీఫా విషయానికొస్తే, ఇంత మంది ఉన్న భవనంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం ఆచరణాత్మకమైనది కాదు. నిర్మాణ సమయంలో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటుకు అనుమతి పొందలేదు. కారణం ప్రాక్టికాలిటీ. సెప్టిక్ ట్యాంకులు నిండటం వల్ల పెద్ద పరిణామాలు చోటు చేసుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యవర్థాలను ఊరు బయట పడేయాలని నిర్ణయించారు.

24 గంటల పాటు నిరీక్షించిన తర్వాత, ట్రక్కులు చెత్తతో లోడ్ అవుతాయి. దీని కోసం చాలా ట్రక్కులను ఉపయోగిస్తారు. 163 అంతస్తులలో 35,000 మందితో ఈ భవనం రోజుకు ఏడు టన్నుల మానవ విసర్జన అవుతుందట. దీనితో పాటు ఇతర మురుగు నీటితో పాటు వ్యర్థాలు కలిపితే ఒక రోజులో ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యర్థాలు 15 టన్నులు. దీన్ని ప్రతిరోజూ మార్చాలి. అయితే ఇప్పుడు భవనంలో మురుగునీటి వ్యవస్థను నిర్మాణంపై చర్చ జరుగుతోంది.

బుర్జ్ ఖలీఫాను స్కిడ్‌మోర్, ఓవింగ్స్, మెరిల్ నిర్మించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం యూఎస్‌లోని చికాగోలో ఉంది. ఈ భవనాన్ని బిల్ బేకర్ చీఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్‌గా, అడ్రియన్ స్మిత్ చీఫ్ ఆర్కిటెక్ట్‌గా డిజైన్ చేశారు. Samsung C&T ప్రధాన కాంట్రాక్టర్. భవన నిర్మాణంలో 12000 మందికి పైగా కార్మికులు పాల్గొన్నట్లు సమాచారం.

బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని ఎత్తైన భవనంతో అత్యంత ఎత్తైన నివాస భవనం, పొడవైన ఎలివేటర్ వంటి అనేక రికార్డులు దీని సొంతం. ఇది అత్యధిక అబ్జర్వేషన్ డెక్ (124వ అంతస్తులో) కూడా ఉంది. ఇక్కడ ఉన్న లిఫ్టులు సెకనుకు 18 మీటర్ల వేగంతో 500 మీటర్ల కంటే ఎక్కువగా వెళ్తాయి. స్విమ్మింగ్ పూల్ 76వ అంతస్తులో ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!