Manmohan Singh Car: మన్మోహన్ సింగ్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి ఇదే నిదర్శనం!
Manmohan Singh Car: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువారం మరణించారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రభుత్వం 7 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. అయితే మన్మోహన్ సింగ్‌కు ఏ కారు అంటే ఎక్కువగా ఇష్టమో తెలుసా..?
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ మాజీ అధికారి, మాజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) చీఫ్ అసిమ్ అరుణ్, దివంగత నేత మారుతీ 800 పట్ల తనకున్న ప్రగాఢ అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ సదర్ నుండి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అసిమ్ అరుణ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 92 ఏళ్ల వయసులో మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత తన మాజీ జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఆర్థికవేత్త-రాజకీయవేత్తగా మారిన మన్మోహన్ సింగ్ గురించి వివరిస్తూ, మన్మోహన్ సింగ్ వద్ద ఒకే ఒక కారు ఉందని, మారుతీ 800 అని చెప్పుకొచ్చారు. ఆ కారును మన్మోహన్ చాలా విలువైనదిగా భావిస్తుండేవారని అన్నారు.
ఇది కూడా చదవండి: Manmohan Singh: కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడో తెలుసా..?
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యాక కూడా సింప్లిసిటీని ఇష్టపడే వ్యక్తి. పెద్ద డిగ్రీలు చదివినా, రాజకీయాలలో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ, అతను ఎప్పుడూ మధ్యతరగతి వ్యక్తిలా ఉండటానికే ఇష్టపడేవారని గుర్తు చేశారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కారుకు బదులు చిన్న కారుపైనే ఎక్కువ మక్కువ చూపేవారని తెలిపారు.
తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఈ కారు ద్వారా మధ్యతరగతితో కనెక్ట్ అయ్యారని భావించడంతో BMPకి బదులుగా తన మారుతీ-800 కారుకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తాను మన్మోహన్ సింగ్‌కు దూరంగా ఉండలేని వ్యక్తి అని అసిమ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అతనితో ఒక బాడీ గార్డ్ మాత్రమే ఉండగలిగితే, మన్మోహన్ సింగ్‌కు నీడలా ఉండటం నా బాధ్యత అని చెప్పుకొచ్చారు.
मैं 2004 से लगभग तीन साल उनका बॉडी गार्ड रहा। एसपीजी में पीएम की सुरक्षा का सबसे अंदरुनी घेरा होता है – क्लोज़ प्रोटेक्शन टीम जिसका नेतृत्व करने का अवसर मुझे मिला था। एआईजी सीपीटी वो व्यक्ति है जो पीएम से कभी भी दूर नहीं रह सकता। यदि एक ही बॉडी गार्ड रह सकता है तो साथ यह बंदा… pic.twitter.com/468MO2Flxe
— Asim Arun (@asim_arun) December 26, 2024
ఇది కూడా చదవండి: Manmohan Singh: నోట్లపై సంతకం చేసిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కరే.. కారణం ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి