AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manmohan Singh: కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడో తెలుసా..?

Manmohan Singh: దేశ మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డా. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. రెండు సార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. మన్మోహన్ సింగ్ తన పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఓ సందర్భంగా కారు కొనాలంటే నగదు లేని సందర్భంగా వచ్చింది..

Manmohan Singh: కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Dec 27, 2024 | 3:25 PM

Share

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ జీవితంలో చేతిలో నగదు లేని సంఘటన ఉంది. కానీ అతని ఇంట్లో 1996 మోడల్ మారుతీ కారు కూడా ఉంది. 2013లో అస్సాం రాజ్యసభ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం మన్మోహన్ సింగ్ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు, అందులో చాలా సమాచారాన్ని పంచుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇలా చేయడం తప్పనిసరి. ఈ అఫిడవిట్‌లో తన కారుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ కారు:

ఆ సమయంలో తన మొత్తం ఆదాయం రూ.40.51 లక్షలు అని మన్మోహన్ సింగ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 3.87 కోట్ల విలువైన చరాస్తులను కలిగి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇది మాత్రమే కాదు, ఆ సమయంలో అతనికి 5 ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 3 సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి. అంతే కాదు అప్పట్లో ఆయనకు రూ.7.5 కోట్ల స్థిరాస్తి ఉంది. ఇందులో చండీగఢ్‌లోని ఇల్లు, ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లోని ఫ్లాట్ ఉన్నాయి.

తన వద్ద 1996 మోడల్‌కు చెందిన మారుతీ కారు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. 1996లో దాదాపు రూ.21వేలకు కొనుగోలు చేశారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ చేతిలో నగదు లేదు. కానీ అతని భార్య గుర్శరణ్ కౌర్ వద్ద రూ.20,000 నగదు ఉంది.

మన్మోహన్ భార్య ఆస్తి

మన్మోహన్ సింగ్ అఫిడవిట్‌లో ఆయన భార్య ఆస్తుల ప్రస్తావన కూడా ఉంది. ఆమెకు రూ.20.31 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. అందులో 150.8 గ్రాముల బంగారం ఉందని, అప్పటి ధర రూ.3.45 లక్షలు. ఆయన సేవింగ్స్ ఖాతాలో రూ.16.62 లక్షలు కూడా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ ఆర్‌బిఐ గవర్నర్ నుండి దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా కూడా పనిచేశారు.

ఇది కూడా చదవండి: Manmohan Singh: నోట్లపై సంతకం చేసిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కరే.. కారణం ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి