AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓర్నీ! ఇదేం లవ్ ప్రపోజ్ మావా.. ప్రియురాలికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడుగా.. వీడియో వైరల్!

ప్రపంచంలో ప్రేమ కంటే అందమైనది మరేదీ లేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచూ ఎన్నో ప్రేమ కథలు వైరల్ అవుతుంటాయి...

Viral Video: ఓర్నీ! ఇదేం లవ్ ప్రపోజ్ మావా.. ప్రియురాలికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడుగా.. వీడియో వైరల్!
Propose
Ravi Kiran
|

Updated on: Dec 22, 2021 | 10:25 AM

Share

ప్రపంచంలో ప్రేమ కంటే అందమైనది మరేదీ లేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచూ ఎన్నో ప్రేమ కథలు వైరల్ అవుతుంటాయి. మీరు కూడా వినే ఉంటారు. తమను అర్ధం చేసుకునే భాగస్వామి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇక ఒక్కసారి అలాంటి వ్యక్తి దొరికిందంటే.. వారికి జీవితాంతం గుర్తిండిపోయే రీతిలో లవ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. ఇదివరకు అయితే ఉత్తరాల ద్వారా తమ ప్రేమను వెల్లడించేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ యుగం కాబట్టి ఎన్నో మార్గాలు.. అందులోనూ క్యూట్‌గా ఉండే పద్దతులను లవ్ ప్రపోజ్ చేయడానికి యువత ఉపయోగిస్తున్నారు. ఇక అలాంటి ఓ లవ్ ప్రపోజల్ వీడియోను ఇప్పుడు చూసేద్దాం. ప్రస్తుతం నెట్టింట ఇదే ట్రెండ్ అవుతోంది. ప్లేగ్రౌండ్‌లో సాఫ్ట్‌బాల్ ఆడుతోన్న ప్లేయర్ తన ప్రియురాలికి వినూత్న రీతిలో లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. సాఫ్ట్‌బాల్ ఆడుతోన్న ఓ వ్యక్తి సడన్‌గా గాయపడినట్లు తన కాలు పట్టుకుని బాధపడుతున్నట్లుగా మీరు చూడవచ్చు. దీనితో వెంటనే టీం ఫిజియో దగ్గర నుంచి చుట్టూ ఉన్న ఆటగాళ్ళందరూ కూడా అతడికి ఏమైందోనని చూడటానికి అక్కడికి చేరుకుంటారు. పెవిలియన్‌లో ఉన్న అతడి ప్రియురాలు కూడా ఖంగారుపడుతూ అక్కడికి వస్తుంది. అంతే సీన్‌లో అసలు ట్విస్ట్ అప్పుడే వస్తుంది. ఆ వ్యక్తి తనదైన స్టైల్‌లో రింగ్‌తో ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా, బాస్కెట్‌బాల్ ప్లేయర్ రెక్స్ చాప్‌మాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఇప్పటివరకు 25 లక్షలకు పైగా వీక్షకులు దీన్ని చూశారు. అలాగే 36 వేల మంది లైక్ కొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.!

ఇది చదవండి:

ఈ వ్యక్తులు పెరుగు అస్సలు తినకూడదు.. విషంతో సమానమట.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!

తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!