Viral Photo: ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. దీనికి సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్...

Viral Photo: ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 21, 2021 | 12:38 PM

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. దీనికి సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఫోటోలో ఏముందో కనిపెట్టేందుకు నెటిజన్లు తెగ వెతుకుతుంటారు. దానికి సమాధానం దొరికే దాకా ఆ పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడతారు. మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును పెట్టే ఫోటో పజిల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. క్యూరియాసిటీతో మనం కూడా సాల్వ్ చేస్తుంటాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అదొక పార్క్ లాంటి ప్రాంతంలాగా మీకు కనిపించవచ్చు. ఇద్దరు పిల్లలు ఇంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వారితో పాటు అక్కడొక విషసర్పం కూడా ఉంది. అది ఎక్కడుందో గుర్తించాలి. ఈ ఫోటోను ఫోటోగ్రాఫర్ తన కెమెరా పనితనంతో చాకచక్యంగా తీశాడు. నూటికి 95 శాతం మంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. తీక్షణంగా చూస్తే మీరు పామును గుర్తించవచ్చు. ఒకవేళ మీకు సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

ఇది చదవండి: Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. ఈజీగా గుర్తించొచ్చు.. ట్రై చేయండి!