AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huge Demand For Gold: మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్

ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. రోజురోజుకూ దీని డిమాండ్ పెరుగుతూనే పోతోంది. నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో అవసరమవుతూ ఉంటుంది. పెళ్లి, శుభకార్యాలు, పుట్టిన రోజు, పండగలు.. ఇలా ప్రతి విషయంలో బంగారు ఆభరణాలను ధరిస్తారు. కేవలం అలంకరణకే కాకుండా అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. బంగారు ఆభరణాలపై బ్యాంకులు రుణాలు ఇస్తాయి. పైగా.. దీని విలువ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ తగ్గే ప్రసక్తి ఉండదు. ఈ నేపథ్యంలో 2024లో కూడా బంగారం మార్కెట్ లో తన పరుగును కొనసాగింది.

Huge Demand For Gold: మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్
Nikhil
|

Updated on: Dec 27, 2024 | 4:45 PM

Share

నిఫ్టీ, ఎస్అండ్ పీ 500 ఇండెక్స్ కంటే ఎక్కువ రాబడి ఈ ఏడాది బంగారం అందించింది. మార్కెట్ నిపుణుల లెక్కల ప్రకారం దాదాపు 27 శాతం రాబడితో ఈ ఏడాదిని ముగించనుంది. బంగారం వినియోగం పెరగడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక పరిస్థితులు దీనికి కారణంగా చెప్పవచ్చు. 2024వ సంవత్సరం బంగారానికి బాగా కలసివచ్చింది. మరి 2025లో ఈ మార్కెట్ మరింత పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఊహించిన విధంగానే డాలర్ బలపడింది. దీంతో నవంబర్ నుంచి బంగారానికి కొంత మెరుపు వచ్చింది.

ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో బులియన్ మొత్తం డిమాండ్ వంద బిలియన్ డాలర్లను దాటింది. 2010 తర్వాత 2024లోనే బంగారం ధర బాగా పెరిగింది. ఈ లోహానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దానికి పలు కారణాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో యుద్దాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక దేశంపై మరొకటి దాడులు చేసుకుంటున్నాయి ఇజ్రాయెల్ – ఇరాన్, ఉక్రెయిన్ – రష్యాల మధ్య జరుగుతున్న యుద్దాలతో భయాందోళనలు కలుగుతున్నాయి. అలాగే సిరియాలో బషర్ అల్ అసద్ పాలన పతనంతో రాజకీయ గందరగోళం నెలకొంది. ఇలాంటి సమయంలో బంగారంపై పెట్టుబడులు పెట్టడమే సురక్షితమని ప్రజలు భావిస్తున్నారు.

వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు ఈ ఏడాది బంగారాన్ని బాగా కొనుగోలు చేశాయి. అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు రేటు తగ్గింపులు కూడా బంగారాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. ద్రవోల్బణం నుంచి రక్షణ కోరుకునే పెట్టుబడిదారులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపాారు. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన బంగారం ఔన్సు ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 2788.54 డాలర్లకు చేరింది. వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. 2025 డిసెంబర్ నాటికి 30,000 డాలర్లకు చేరుతుందని చెబుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం.. ఆసియాలోని ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే ఏడాది బంగారానికి పోటీ ఎదురవుతుంది.మన దేశంలో మాత్రం దీని డిమాండ్ కే ఎలాంటి లోటు ఉండదు. 2024 మాదిరిగానే పరుగులు తీయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి