Dead Body Smell: మరణించిన తర్వాత మృతదేహం చెడు వాసన ఎందుకు వస్తుంది?

Dead Body Smell: ఏ కారణంచేతనైన గాని మనుషులు గానీ, జంతువులు గానీ, ఇంకేదైన సరే చనిపోయిన కొన్ని గంటల తర్వాత శవం చెడు వాసన వస్తుంటుంది...

Dead Body Smell: మరణించిన తర్వాత మృతదేహం చెడు వాసన ఎందుకు వస్తుంది?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2021 | 1:18 PM

Dead Body Smell: ఏ కారణంచేతనైన గాని మనుషులు గానీ, జంతువులు గానీ, ఇంకేదైన సరే చనిపోయిన కొన్ని గంటల తర్వాత శవం చెడు వాసన వస్తుంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలాంటి వాసన ఉండనప్పుడు శనిపోయిన తర్వాత కొన్ని గంటలు కాగానే వాసన మొదలవుతుంది. అలా చెడు వాసన ఎందుకు వస్తుందనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. మరి అలా శవం అలా చెడు వాసన ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మనతోపాటు జీవులన్నింటిలో జీవానికి కారణమైన ఎన్నో రసాయనాలున్నాయి. అందులో ప్రోటీన్లు, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ఎంజైములలో నత్రజని బాగా ఉంటుంది. కొన్ని ఎంజైములలో గంధకం కూడా ఉంటుంది. మనిషి తదితర జీవులతో పాటు ప్రపంచవ్యాప్తంగా గాలిలోను, నీటిలోను, మట్టిలోను వివిధ రకాలయిన జీవులున్నాయి. అందులో బాక్టీరియాలు కూడా ఉన్నాయి. చాలా మట్టుకు బాక్టీరియాలు పరాన్నజీవులు. వాటికి సొంతంగా ఆహారం సముపార్జించుకొనే శక్తి లేదు. కేవలం ఇతర జీవ కణాల్లో ఉన్న పోషక పదార్థాల్ని రసాయనికంగా మార్పిడి చేసి తమకనుకూలమైన రూపంలోకి తెచ్చుకొంటాయి. ఆ క్రమంలో కొన్ని వృథారసాయనాలు కూడా ఉత్పత్తి అవుతాయి.

అలాగే పరాన్న జీవులయిన బాక్టీరియాలు మృత దేహాల మీద దాడి చేసినప్పుడు ఆ శరీరంలో ఉన్న వివిధ రసాయనాల్ని అవి తమకనుకూల రీతిలో మార్చుకొనే క్రమంలో దుర్గంధాన్ని ఇచ్చే గంధక పదార్థాలు, ఫాస్ఫరస్‌ పదార్థాలు, నత్రజనీ పదార్థాలు విడుదలవుతాయి. ఇవే మనకు దుర్గంధాన్ని కల్గిస్తాయి. మన ప్రాణమున్నంత వరకు ఈ బాక్టీరియాల దాడిని అరికట్టేలా మనలో రక్షణ వ్యవస్థ ఉంటుంది. మరణం తర్వాత రక్షణ వ్యవస్థ ఉండదు. కాబట్టి బాక్టీరియాల ఆటలకు హద్దూ పద్దూ ఉండదు. అందుకే మనం మృతి చెందిన తర్వాత ఎక్కువ గంటలు ఉంటే చెడు వాసన రావడానికి కారణం ఇదే.

ఇవి కూడా చదవండి:

Fish Benefits: చేపలు ఎక్కువగా తినేవారికి అలాంటి సమస్యలు రావు.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు

ఈ అలవాట్లు మానుకోక పోతే మీకు వృద్దాప్యం ముందే వస్తుంది.. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..