Omicron Cases: తెలంగాణలో పంజా విసురుతోన్న ఒమిక్రాన్.. అక్కడ పది రోజుల పాటు లాక్‌డౌన్..
Omicron Cases: సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్కొక్కటిగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏకంగా 14 కేసులు..
Omicron Cases: సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్కొక్కటిగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏకంగా 14 కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా రాజన్న సిరిసిల్లాలో ఒమిక్రాన్ కలకలం రేపింది. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ అని తేలింది. దీంతో గ్రామస్తులు సెల్ఫ్ లాక్‌డౌన్‌ను ప్రకటించుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. గూడెంకు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వైద్య పరీక్షల్లో సదరు వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ అని నిర్ధారణగా తేలింది. అంతేకాకుండా అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన గూడెం గ్రామస్తులు సెల్ఫ్ లాక్‌డౌన్‌ను విధించుకున్నారు. 10 రోజుల పాటు గ్రామంలోకి ఇతరులు రావొద్దని, ఇతర ప్రాంతాలకు గ్రామం వారు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే సదరు వ్యక్తి ఇటీవల ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురంలో ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది శాంపిళ్లను సేకరించిన అధికారులు నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపారు. వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.