Conjoined Twins: వారు ఇద్దరు కాదు ఒక్కరు.. పంజాబ్ కుర్రాళ్లు ఉద్యోగం సాధించారు.. స్ఫూర్తిగా నిలిచారు..

వారు ఇద్దరు కాదు, ఒక్కరు. విజయంలో మాత్రం ఎవరికి వారే.. అయినా వారే విన్నర్స్.. భౌతికంగా కలిసి పుట్టారు, అంగవైకల్యాన్ని జయించి చదువు పూర్తి చేశారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగం సంపాదించి చాలా మందిలో స్ఫూర్తి కలిగించారు.

Conjoined Twins: వారు ఇద్దరు కాదు ఒక్కరు.. పంజాబ్ కుర్రాళ్లు ఉద్యోగం సాధించారు.. స్ఫూర్తిగా నిలిచారు..
Twins Joined The Job
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 24, 2021 | 8:35 AM

Government Job: వారు ఇద్దరు కాదు, ఒక్కరు. విజయంలో మాత్రం ఎవరికి వారే.. అయినా వారే విన్నర్స్.. భౌతికంగా కలిసి పుట్టారు, వైకల్యాన్ని జయించి చదువు పూర్తి చేశారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగం సంపాదించి చాలా మందిలో స్ఫూర్తి కలిగించారు. పంజాబ్‌ అమృతసర్‌కు చెందిన అవిభక్త కలలు శారరీక లోపాన్ని అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. 2003 జూన్‌ 14న ఢిల్లీలో జన్మించిన సోహ్నా, మోహనాలు రెండు హృదయాలు, చేతులు, మూత్రపిండాలు, వెన్నుపాములతో జన్మించారు. కానీ వీరికి ఒకటే కాలేయం, పిత్తాశయం, కాళ్లు ఉన్నాయి. వీరిని పరిశీలించిన ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ వేరే చేస్తే.. ప్రాణాంతకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అంత వరకు వెళ్లలేదు.

దీనికి తోడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నిరాధరణకు గురయ్యారు. పిగల్వార్‌ సంస్థ వీరికి చదువు చెప్పించడమే కాక బాగోగులు చూసుకుంది. దీంతో సోహ్నా, మోహనాలు తమ శారీరక లోపాన్ని అధిగమించి చదువుకోవడమే కాక పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. పైగా వీరికి ఆ రంగంలో అనుభవం ఉన్నందున నియమించకున్నట్లు పీఎస్‌పీసీఎల్‌ ప్రకటించింది. తమకు ఉద్యోగం రావడం పట్ల అవిభక్త కవలలు సంతోషం వ్యక్తం చేశారు.

అవకాశం ఇచ్చిన పంజాబ్‌ ప్రభుత్వం, తమకు విద్యనందించిన పింగల్వార్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. అతుక్కుని పుట్టిన పిల్లలు పెరగడానికి, రోజు వారీ పనుల చేసుకోవడానికే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఈ పిల్లలు మనో ధైర్యంతో ముందుకు సాగి.. ఎలక్ట్రికల్ ఇంజనీరంగ్‌లో డిప్లొమా చదివారు.

నలుగురికీ ఆదర్శంగా నిలవాలన్న తపనతో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగిపోకుండా తమకు ఉన్న స్కిల్‌తో ప్రైవేట్‌గా ఎలక్ట్రికల్ వర్క్స్‌ చేయడం మొదలుపెట్టారు. PSPCLలో జాబ్‌ కొట్టాలన్న పట్టుదలతో అనుకున్నది సాధించారు. డిసెంబర్‌‌ 20న అమృత్‌సర్‌‌లో 66 కేవీ సబ్‌ స్టేషన్‌లో జాబ్‌లో చేరారు. వీరికి డిజేబుల్‌ కోటాలో ఉద్యోగం లభించింది. ఇద్దరికీ కలిపి 20 వేల రూపాయల జీతం రానుంది.

ఇవి కూడా చదవండి: Srisailam Drone: శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం.. డ్రోన్‌ ప్రయోగాన్ని అడ్డుకున్న ఆలయ భద్రతా సిబ్బంది..

Tammineni Sitaram: కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. టోర్నమెంట్‌‌లో ఘటన..