AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tammineni Sitaram: కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. టోర్నమెంట్‌‌లో ఘటన..

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కిందపడిపోయారు. శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను..

Tammineni Sitaram: కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. టోర్నమెంట్‌‌లో ఘటన..
Ap Speaker Tammineni Sitara
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 23, 2021 | 2:32 PM

AP Speaker Tammineni Sitaram: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కిందపడిపోయారు. శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్‌గా మారిపోయారు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు స్లిప్ కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో పొట్టి ప్రో కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. భారత దేశానికి క్రీడల్లో గుర్తింపు తెచ్చిన కబడ్డీ క్రీడకు ఉన్న క్రేజే వేరు అని చెప్పాలి. ఆ క్రీడా పోటీలు రాష్ట్రంలో సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్‌ కాలేజీ వేదికగా ఆ నియోజకవర్గం స్దాయి సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంబించారు ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

క్రికెట్, కబాడి ఆడి విద్యార్థులు ఉత్సాహ పరిచారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అనంతరం ఆయన కూడా కబడ్డీ ప్లేయర్ అవతారం ఎత్తి ఒక టీం తరుపున కూతకు వెళ్లారు. అలా కబడ్డీ ఆడుతూ ముగ్గురిని ఔట్ చేసిన ఉత్సాహంతో నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో కాళు జారీ కింద పడిపోయారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆయన్ని వెంటనే లేవనెత్తారు. ఎటువంటి గాయాలు కాక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బి.వి.యస్.నాయుడు (సత్యం), టీవీ9 రిపోర్టర్ , శ్రీకాకుళం జిల్లా

ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్‌.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..