AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Farmer’s Day 2021: రైతుల జీవితాలపై సాంగ్.. మీ కళ్ళల్లో నీళ్ళు చెమ్మగిల్లుతాయ్

'రైతు బాగుంటే దేశం బాగుంటుంది'... 'జై జవాన్.. జై కిసాన్'... ఇవి కేవలం స్పీచ్‌ల్లో మాటలుగా మాత్రమే మిగిలిపోతున్నాయ్.  ప్రతి రాజకీయ నాయకుడి స్పీచ్‌‌లో కామన్‌గా వినిపించే మాటలు ఇవి.

National Farmer's Day 2021: రైతుల జీవితాలపై సాంగ్.. మీ కళ్ళల్లో నీళ్ళు చెమ్మగిల్లుతాయ్
Tribute To Farmers
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2021 | 4:15 PM

Share

‘రైతు బాగుంటే దేశం బాగుంటుంది’… ‘జై జవాన్.. జై కిసాన్’… ఇవి కేవలం స్పీచ్‌ల్లో మాటలుగా మాత్రమే మిగిలిపోతున్నాయ్.  ప్రతి రాజకీయ నాయకుడి స్పీచ్‌‌లో కామన్‌గా వినిపించే మాటలు ఇవి. నిత్యం తాను ఓడిపోతూనే.. ప్రపంచాన్ని గెలిపించడం రైతుకు మాత్రమే సాధ్యమేమో. ఎందుకంటే ప్రతి మనిషికి రోజూ ఆకలి వేస్తుంది..అప్పుడు ముద్ద నోట్లోకి వెళ్తుంది అంటే దానికి కారణం అతడేగా. వ్యవసాయంలో లాభం అనే మాట ఇప్పుడు లేదు. చేసిన కష్టానికి డబ్బులొస్తే చాలు అనుకునే రోజులొచ్చాయ్. అప్పులు, గిట్టుబాటులేని ధరలు వారిని నిండా మింగేస్తున్నాయ్. నకిలీ విత్తనాలు, పురుగుమందులతో అమాయకపు రైతు మోసపోతూనే ఉన్నారు. ఉన్నఫలంగా వైరస్‌లు అటాక్‌ అయి.. పంట నాశనం అయిపోతుంది. అతివృష్టి అయినా సమస్యే.. అనావృష్టి అయినా సమస్యే.  కొద్దో గొప్పో పంట పండితే.. దళారుల రూపంలో ఆ కాస్తా ఆవిరైపోతుంది. ఇన్ని కష్టాలు ఉన్నా, ఎంత నష్టమెచ్చినా.. రైతు వ్యవసాయాన్ని వదులుకోలేడు. ఆళి మెడలోని పుస్తెలు తాడు తాకట్టు పెట్టి.. పెట్టుబడి పెట్టి మళ్లీ వ్యవసాయమే చేస్తాడు. ఎందుకంటే రైతుకు సాయం చేయడమే వచ్చు.. వ్యవసాయం చేయడమే వచ్చు. పిచ్చిమారాజులకు మరో పని తెలీదు. ఎద్దుతో దోస్తి కట్టి పొద్దుపొడిచే వేళ బయలుదేరి.. పొద్దు కూకే వేళ ఇంటికి వస్తాడు. ఇల్లాలు కట్టిన పచ్చటి మెతుకులనే పంచభక్ష పరమాన్నాలుగా భావిస్తాడు. అన్నట్లు ఈరోజు జాతీయ రైతుల దినోత్సవం. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా రైతు దినోత్సం జరపుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే రైతు లేకపోతే ఏ రోజు గడుస్తుంది చెప్పిండి. కాగా అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’ చిత్రంలోని ‘తేరి మిట్టి’ సాంగ్ చాలామందికి తెలిసే ఉంటుంది.  భాష తెలియకపోయినా.. ఆ ట్యూన్‌లోని డెప్త్ అందరి హృదయాలను తాకుతుంది. కాగా ఆ ట్యూన్‌కు ప్రస్తుత రైతుల జీవితాలను ప్రతిబింభించేలా తెలుగు లిరిక్స్ రాసి.. ఎడిట్ చేశారు. ఆ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. మీ కళ్లల్లో నీళ్లు చెమ్మగిల్లేలా చేసే ఆ పాటను దిగువన వినండి.

Also Read: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!