Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సామాన్యుడిలా మారిపోయిన మంత్రి.. ఆర్టీసీ బస్సులో టికెట్ కొనుక్కోని ప్రయాణం చేసిన పెద్దిరెడ్డి..

ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్ది రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుల్లాగే కండక్టర్‌ వద్ద టికెట్లు కొనుగోలు చేసి బస్సులో ప్రయాణించారు

Andhra Pradesh: సామాన్యుడిలా మారిపోయిన మంత్రి.. ఆర్టీసీ బస్సులో  టికెట్ కొనుక్కోని ప్రయాణం చేసిన పెద్దిరెడ్డి..
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 3:34 PM

ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్ది రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుల్లాగే కండక్టర్‌ వద్ద టికెట్లు కొనుగోలు చేసి బస్సులో ప్రయాణించారు. అంతకుముందు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్.అగ్రహారం, ఏ.కొత్తకోట మధ్య నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. విద్యార్థుల రాకపోకలకు అనువైన సమయంలో తిరిగేలా ఈ నూతన బస్సులు ఏర్పాటుచేశారు. పూజా కార్యక్రమాలతో కొత్త బస్సులు ప్రారంభించిన పెద్దిరెడ్డి ఆ తర్వాత బస్సులో ప్రయాణించారు. అనంతరం చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘానికి రూ.1.50 కోట్ల చెక్కును అందించారు.

రైతు పక్షపాతి జగన్‌.. ‘ప్రపంచబ్యాంకు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన మండలాల్లోని రైతు సంఘాలకు నిధులు మంజూరు చేస్తోంది. ఈ నిధులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. రైతుల కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక ఉత్పత్తులను సాధిస్తున్నాం. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.

Also Read:

Writing with fire: ఆస్కార్‌ రేసులో ఇండియన్‌ డాక్యుమెంటరీ.. షార్ట్‌లిస్ట్‌ కాలేకపోయిన కూళంగల్‌..

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

Tammineni Sitaram: కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. టోర్నమెంట్‌‌లో ఘటన..