Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hit.Movie: తెలుగు ఎన్ఆర్ఐ ఓటీటీ ప్లాట్‎ఫారమ్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా సినిమాలు చూడొచ్చటా..!

ఓ తెలుగు ఎన్‎ఆర్ఐ కొత్త ఓటీటీ ప్లాట్‎ఫారమ్ పరిచయం చేయనున్నారు. OTT ప్లాట్‌ఫారమ్ - Hit.movieని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Hit.Movie: తెలుగు ఎన్ఆర్ఐ ఓటీటీ ప్లాట్‎ఫారమ్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా సినిమాలు చూడొచ్చటా..!
Hit Movies
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 23, 2021 | 4:59 PM

ఓ తెలుగు ఎన్‎ఆర్ఐ కొత్త ఓటీటీ ప్లాట్‎ఫారమ్ పరిచయం చేయనున్నారు. ఎన్‎ఆర్ఐ కొల్లు రంజిత్ ‎హైదరాబాద్‌కు చెందిన తన చిన్ననాటి స్నేహితుడు వెంకట్ యేలేటితో కలిసి, ఈ కొత్త OTT ప్లాట్‌ఫారమ్ – Hit.movieని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఓటీటీని సబ్‌స్క్రయిబ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు నచ్చిన సినిమాలను మౌస్ క్లిక్‌తో చూడొచ్చు. అయితే ఇందులో సినిమా చూడాలంటే టికెట్ కొనుగోలు చేయాలి. మొబైల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, టెలివిజన్, హోమ్ థియేటర్‌లో నచ్చిన చలనచిత్రాన్ని చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ-5 వంటి ఇతర OTTల మాదిరిగా కాకుండా ఇందులో ఎవరైనా నెలవారీ, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా సభ్యత్వాలను తీసుకోవాలని రంజిత్ చెప్పారు. ఇతర OTTల వలె నిర్మాతాలు తమ డిజిటల్ హక్కులను విక్రయించాల్సిన అవసరం లేదన్నారు. వారు తమ యాజమాన్య హక్కులను వదులుకోవాల్సిన అవసరం లేదని, మధ్యవర్తులు లేరని, ఇది తప్పనిసరిగా నిర్మాత- OTT స్నేహపూర్వక ప్లాట్‌ఫారమ్ అని పేర్కొన్నారు.

నిర్మాతలు చేయాల్సిందల్లా సినిమా వివరాలు, లిస్టింగ్ ఫీజు చెల్లించి, అవసరమైన నో యువర్ కస్టమర్ (KYC) పత్రాలను జోడించిన తర్వాత, వారి చిత్రాల మాస్టర్ ఫైల్‌లను సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు. ” కంటెంట్‌ని ధృవీకరించిన తర్వాత అందులో అభ్యంతరకరమైన కంటెంట్ లేదా పోర్న్ లేవని నిర్ధారించిన తర్వాత సినిమా 72 గంటలు వీక్షకుల కోసం స్ట్రీమింగ్ ఉంటుందన్నారు. సైట్‌లో అప్‌లోడ్ చేసిన చిత్రాలకు డిజిటల్ మార్కెటింగ్, ప్రచారాన్ని హిట్.మూవీ స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్న రంజిత్.. ఈ చిత్రాలను 150కి పైగా దేశాల్లో ప్రసారం చేయవచ్చని చెప్పారు.” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలా, లేదా ఎంపిక చేసిన కొన్ని దేశాలు లేదా మాతృదేశంలో మాత్రమే ప్రసారం చేయాలా అనేది నిర్మాతలు నిర్ణయించుకోవాలి” అని రంజిత్ తెలిపారు.

ఈ వేదికపై టిక్కెట్ ధరలను నిర్మాతలే నిర్ణయిస్తారని రంజిత్ తెలిపారు. “నిర్మాతలు OTT మధ్య ఆదాయం 70:30 ప్రాతిపదికన పంచుకుంటామన్నారు. మేము ప్రతి దేశంలోని టిక్కెట్ల విక్రయాలపై పన్ను చెల్లిస్తామన్నారు. నిర్మాతలు Hit.movie ప్లాట్‌ఫారమ్‌లో తమ సినిమాల ప్రీ-బుకింగ్ ఫీచర్‌ను కూడా ఎంచుకోవచ్చు. ప్లాట్‌ఫారమ్ కంటెంట్ భద్రతకు కూడా హామీ ఇస్తుందని, తద్వారా కాపీరైట్ సమస్యలు ఉండవని రంజిత్ చెప్పారు. “మేము డొమైన్ ఆధారిత పరిమితులు, కంటెంట్ భద్రతా విధానాలు (CSP), సంతకం చేసిన URLలు, డిజిటల్ హక్కుల నిర్వహణ (DRM) విధానాలను అమలు చేస్తాం” అని రంజిత్ చెప్పారు. ఈ ఓటీటీలో 4K HDR నాణ్యతతో చిత్రాల స్ట్రీమింగ్‌ ఉంటుందని చెప్పారు.

“Hit.Movie అన్ని ప్రధాన బ్రౌజర్‌లలో పని చేస్తుంది. Google TV (Android TV), Apple TV, Firestick కోసం యాప్‌లు అందుబాటులో ఉన్నాయి” అని పేర్కొన్నారు. డైరెక్ట్ రిలీజ్‌కు థియేటర్లు దొరకని చిన్న బడ్జెట్ చిత్రాలకు తన ప్లాట్‌ఫారమ్ సరైన వేదిక అని రంజిత్ చెప్పారు.

Read Also.. VPF vs PPF: VPF అంటే ఏమిటి.. PPF కంటే VPF బెటరా.. ఎందులో వడ్డీ ఎక్కువ వస్తుంది..