Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్‌ సీఈవోగా ఆమ్రపాలి..

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్ర నూయి, అరవింద్ కృష్ణ, పరాగ్ అగర్వాల్, ఇటీవల లీనా నాయర్‌(చానెల్‌ సీఈవో).. ఇలా ప్రపంచంలోని టాప్‌ కార్పొరేట్‌ కంపెనీలన్నింటికీ భారతీయులే సారథులుగా ఉన్నారు

Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్‌ సీఈవోగా ఆమ్రపాలి..
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 7:08 PM

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్ర నూయి, అరవింద్ కృష్ణ, పరాగ్ అగర్వాల్, ఇటీవల లీనా నాయర్‌(చానెల్‌ సీఈవో).. ఇలా ప్రపంచంలోని టాప్‌ కార్పొరేట్‌ కంపెనీలన్నింటికీ భారతీయులే సారథులుగా ఉన్నారు. కేవల టెక్‌ అండ్‌ ఐటీ కంపెనీలే కాదు.. ఏ రంగంలోనైనా భారతీయులదే హవా నడుస్తోంది. కంపెనీ సీఈవోలుగా అందలమెక్కుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మరొకరు చేరారు. ఆమె 36 ఏళ్ల ఆమ్రపాలి అమీ గ్యాన్‌. భారతీయ మూలాలున్న ఆమె ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో దూసుకుపోతోన్న కంటెంట్‌ సబ్ స్క్రిప్షన్ సర్వీస్‌ కంపెనీ ‘ఓన్లీఫ్యాన్స్‌’ కు సీఈవోగా నియమితురాలైంది. ఇంతకుముందు వరకు ఇదే కంపెనీలో చీఫ్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఆమ్రపాలి.. అయితే ఓన్లీఫ్యాన్స్‌ వ్యవస్థాపకుడు టిమ్‌ స్టోక్లే పదవి నుంచి అనూహ్యంగా దిగిపోవడంతో నూతన సీఈవోగా డిసెంబర్‌ 21న బాధ్యతలు స్వీకరించింది గ్యాన్‌.

కరోనా సమయంలో కాసుల పంట.. ‘ఓన్లీ ఫ్యాన్స్‌’.. ఇదొక అడల్ట్‌ కంటెంట్‌ ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌. లండన్‌ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ వేదిక ద్వారా కంటెంట్‌ క్రియేటర్లు నేరుగా తమ కంటెంట్‌ను ఇతరులకు అమ్ముకోవచ్చు. తద్వారా కంటెంట్‌ క్రియేటర్లకు ఆదాయంతో పాటు సంస్థకు కొద్ది మేర కమీషన్‌ లభిస్తోంది. 2016 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతోన్నా… కరోనా సమయంలో అనూహ్యంగా లాభాల బాట పట్టిందీ కంపెనీ. దీనికి కారణమూ లేకపోలేదు.. కొవిడ్‌ సమయంలో ఈ సంస్థ అడల్ట్‌, అశ్లీల కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. ఫలితంగా ఎక్కువ మంది అడల్డ్‌ కంటెంట్ క్రియేటర్లకు చేతినిండా పనితో పాటు ఆదాయమూ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘ఓన్లీ ఫ్యాన్స్‌’ సైట్‌ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2019లో ఈ సంస్థకు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 130 మిలియన్లకు చేరుకోవడం విశేషం. ఇలా కంపెనీ కస్టమర్ల సంఖ్య, ఆదాయమూ పెరగడం వెనక ఆమ్రపాలి ఐడియాలున్నాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆమెను సీఈవోగా నియమించామని వారు పేర్కొన్నారు.

ముంబయి టు కాలిఫోర్నియా.. ఇక ఆమ్రపాలి విషయానికొస్తే.. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. విద్యాభ్యాసమంతా అమెరికాలోని కాలిఫోర్నియాలో సాగింది. అక్కడి FIDM (ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ మర్చండైజింగ్‌) నుంచి మర్చండైజ్ మార్కెటింగ్‌లో అసోసియేట్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సాధించింది. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి పీఆర్‌ అండ్‌ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను అభ్యసించింది. ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంట్రప్రెన్యూర్‌షిప్ సర్టిఫికేట్ తీసుకుంది. ఇలా మూడు డిగ్రీ పట్టాలు సాధించిన ఆమ్రపాలి కన్జూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆపై ఆర్కెడ్‌ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా, కన్నాబిస్‌ కేఫ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, క్వెస్ట్‌ న్యూట్రీషియన్‌కు బ్రాండ్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌గా, రెడ్‌ బుల్‌ మీడియా హౌజ్‌లో కూడా వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వహించింది. ఇప్పుడు ఓన్లీఫ్యాన్స్‌ సీఈవోగా కొత్త బాధ్యతలు స్వీకరించింది.

View this post on Instagram

A post shared by Amrapali Gan (@amrapali_gan)

Also Read:

Bangarraju: జూనియర్ బంగార్రాజుతో స్టెప్పులేస్తున్న నాగలక్ష్మీ.. ఆకట్టుకుంటున్న చై.. కృతి పోస్టర్..

Covid New Guidelines: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

Samantha: ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత