AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Drone: శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం.. డ్రోన్‌ ప్రయోగాన్ని అడ్డుకున్న ఆలయ భద్రతా సిబ్బంది..

శైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం రేపింది. ఆలయ పుష్కరిణీ వద్ద డ్రోన్‌ ప్రయోగానికి కొందరు యత్నించడంతో ఆలయ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకొని డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ మళ్లీ డ్రోన్‌ ఎలా వచ్చింది..?

Srisailam Drone: శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం.. డ్రోన్‌ ప్రయోగాన్ని అడ్డుకున్న ఆలయ భద్రతా సిబ్బంది..
Drone
Sanjay Kasula
|

Updated on: Dec 24, 2021 | 7:14 AM

Share

Srisailam Drone: శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం రేపింది. ఆలయ పుష్కరిణీ వద్ద డ్రోన్‌ ప్రయోగానికి కొందరు యత్నించడంతో ఆలయ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకొని డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ మళ్లీ డ్రోన్‌ ఎలా వచ్చింది..? ప్రఖ్యాత దేవాలయం శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ సంచరించడం కలకలం రేపింది. ఆలయ పుష్కరిణీ దగ్గర కొందరు వ్యక్తులు డ్రోన్‌ను ఎగురవేశారు. డ్రోన్‌ సంచరిస్తున్న దృశ్యాలను చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆలయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. డ్రోన్‌ వెంట పరుగలు తీసి..టెక్నాలజీతో దాన్ని కిందకి దించేశారు. డ్రోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్రాంతంలోనే రిమోట్‌తో డ్రోన్‌ను ఆపరేట్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రోన్‌ ఎందుకు ఎగిరివేశారు..? ఆలయం దగ్గరికి ఎలా తీసుకొచ్చారు..? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఐతే పట్టుబడ్డ ఇద్దరు గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. శ్రీశైలం ఎందుకు వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు. అనంతరం వాళ్లిద్దరిని పోలీసులకు అప్పగించారు.

శ్రీశైలం ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణీ దగ్గర డ్రోన్‌ ఎగురవేస్తున్నా…ఆలయ భద్రతా సిబ్బంది గుర్తించలేదు. ప్రధాన ఆలయ గోపురానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. భక్తులు వీడియో తీసి….అధికారులకు సమాచారం ఇచ్చేవరకూ ఎవ్వరూ గుర్తించకపోవడం భద్రతా వైఫల్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో శ్రీశైలం ఆలయంలో రాత్రిపూట డ్రోన్‌ల కలకలం రేపడంతో…ఆ ప్రాంతంలో వాటిని నిషేధించారు. అయినా…శ్రీశైలం ఆలయం వరకూ డ్రోన్‌ ఎలా తీసుకొచ్చారు…? వారికి సహకరించిన వారు ఎవరు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే గుజరాత్‌ నుంచి వచ్చిన వారిని పోలీసులు ఇదే యాంగిల్‌లో లోతుగా విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: PM Modi: ఆవును ఎగతాళి చేసేవారి జీవనోపాధి ఈ పశుసంపద ద్వారానే నడుస్తోంది.. బెనారస్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

Fact Check: కొణిదెల ఉపాసన నిజంగానే ప్రధాని మోదీని కలిశారా..? ఇదిగో క్లారిటీ