Dhanurmasa: నేడు తిరుప్పావై 9వ రోజు..భగవంతుడిపై తప్ప ఇతరములపై కోరికలు లేని.. గోపిక తమకు మార్గదర్శనం చూపమన్న గోదా..

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు తొమ్మిదవ రోజు. ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాశురాలలో ఈ రోజు తిరుప్పావై తొమ్మిదవ పాశురం..

Dhanurmasa: నేడు తిరుప్పావై 9వ రోజు..భగవంతుడిపై తప్ప ఇతరములపై కోరికలు లేని.. గోపిక తమకు మార్గదర్శనం చూపమన్న గోదా..
Tiruppavai 9th Pashuram
Follow us
Surya Kala

|

Updated on: Dec 24, 2021 | 6:48 AM

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు తొమ్మిదవ రోజు. ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాశురాలలో ఈ రోజు తిరుప్పావై తొమ్మిదవ పాశురం.. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి.  ఒక్కొక్క రోజు ఒక్కొక్క‌ వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. మంచు బిందువులు కురిసిన గడ్డిని తినేసిన ఆలమందలు నెమరువేసుకుంటూ ఉరకలు వేస్తూ ఊరు దాటి వెళుతున్నాయి. చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి. ఈలోగా ఆ చిన్ని కన్నయ్య ని కూడా లేపాలి. ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈరోజు ధనుర్మాసంలో తొమ్మిదవ రోజు ..ఈరోజు  పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం..

9వ పాశుర‌ము

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్ ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ? మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్

అర్ధం: నాలుగవ గోపిక నిదురించుచున్న మేడ దోషము లేని .. నవరత్నాలతో పొడగబడి నిర్మించిన మేడ ఇది మనకు పరమాత్మకు మధ్య ఉన్న నవవిధ సంబంధాన్ని సూచిస్తే, దాని చుట్టూ కాంతులీనుచున్న దీపములు, గోపిక యొక్క జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. శ్రవణం, మననం వల్ల మనోమాలిన్యాల దోషాలు దూరమై భగవత్ జ్ఞానం అనే కవచంతో భగవంతుడు తప్ప ఇతరమైన కోరికలపై సృహలేని స్థిత ప్రజ్ఞత స్థితికి చేరినది ఈ గోపిక. అలాంటి గోపిక లేచి తమకు మార్గదర్శనం చేయమని ప్రార్ధిస్తుంది గోదాదేవి ఈ రోజు.

Also Read:

 తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి కోటా వర్చువల్ సేవా దర్శన టికెట్లను విడుదల చేసిన టీటీడీ

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు