Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (24-12-2021): వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ వృత్తిలో ఉన్నా.. ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా .. ప్రయాణం చేయాలన్నా.. శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా..
Horoscope Today (24-12-2021): వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ వృత్తిలో ఉన్నా.. ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా.. శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 24వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయత్నాలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఋణలాభం పొందుతారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధవహించాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్థులకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు స్నేహితులను కలుస్తారు. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొత్త వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళన తొలగించుకోవాలి. వృధా ప్రయాణాలు అధికమవుతాయి. ధన వ్యయం తప్పదు. శారీరక అనారోగ్య బాధపడతారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక పరిస్థితిలో మార్పులు ఉండవు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనంతో ఇబ్బంది పడతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక భయాందోళనకు దూరమవుతారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మానసికశాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులను కలుస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో విశేషాలాభాలను ఆర్జిస్తారు. సుఖ సంతోషాలతో గడుపుతారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మిక్కిలి దైర్యం సాహసాలను కలిగి ఉంటారు. శత్రుబాధలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు పొందుతారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు సుఖ సంతోషాలతో గడుపుతారు. కొత్త వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అనారోగ్య బాధలకు గురవుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో అధిక వ్యయప్రయాసలు కలుగుతాయి.
మీన రాశి: ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్త్రీ వలన ధన లాభం పొందుతారు. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు మేలు చేస్తారు.
Also Read: నేడు తిరుప్పావై 9వ రోజు..భగవంతుడిపై తప్ప ఇతరములపై కోరికలు లేని.. గోపిక తమకు మార్గదర్శనం చూపమన్న గోదా..