COVID-19 3rd Wave: ఇండియాలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. IIT కాన్పూర్ పరిశోధకుల అంచనా..!
IIT కాన్పూర్ (IIT-K) పరిశోధకులు కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
IIT కాన్పూర్ (IIT-K) పరిశోధకులు కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కొత్త వేరియంట్ Omicron ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో హెల్త్ సర్వర్ MedRxiv నివేదిక ప్రచురించింది. ” ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్‌లను అనుసరించి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇండియాలో థర్డ్ వేవ్ డిసెంబరు మధ్యలో ప్రారంభమై ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది.”
థర్డ్ వేవ్‌ను అంచనా వేయడానికి బృందం గాస్సియన్ మిక్స్చర్ మోడల్‌ను ఉపయోగించింది. పరిశోధన నివేదిక భారతదేశంలోని ఫస్ట్, సెకండ్ వేవ్ డేటాను, దేశంలోని థర్డ్ వేవ్ అంచనా వేయడానికి వివిధ దేశాలలో Omicron వేరియంట్ కేసుల పెరుగుదల ఆధారంగా నివేదిక రూపొందించింది. ఉపయోగించింది. ఓమిక్రాన్ పరిశోధకులు మాట్లాడుతూ,
“మా ప్రాథమిక పరిశీలన తేదీ నుంచి 735 రోజుల తర్వాత కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నాం. జనవరి 30, 2020 ఇండియాలో మొదటి అధికారిక కోవిడ్-19 కేసు నమోదయింది. కాబట్టి డిసెంబర్ 15 నాటికి కేసులు పెరగడం ప్రారంభిస్తాయి. ఫిబ్రవరి 3, 2022 నాటికి మూడో వేవ్ గరిష్ఠ స్థాయి చేరుతాయి. IIT-IIT కాన్పూర్‌లోని గణితం, గణాంక శాస్త్ర విభాగానికి చెందిన సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్రా శంకర్ ధర్ మరియు శలభ్ పరిశోధన బృందంలో ఉన్నారు. IIT కాన్పూర్ ఇండియాలో సెకండ్ వేవ్ వస్తుందని అంచనా వేసింది. అప్పుడు వారి అంచనా నిజమైంది.
Read Also.. Omicron Alert: భారత్‌లో ఒమిక్రాన్ ప్రకంపనలు.. అక్కడ రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ..