AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Alert: భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రకంపనలు.. అక్కడ రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ..

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్‌ భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 350కు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సంబరాలతో కేసుల సంఖ్య

Omicron Alert: భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రకంపనలు.. అక్కడ రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ..
Basha Shek
|

Updated on: Dec 24, 2021 | 4:33 PM

Share

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్‌ భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 350కు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సంబరాలతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న భావన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్‌ విస్తరించకుండా ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. ఈనేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో నిన్నటి నుంచే నైట్‌ కర్ఫ్యూ అమలవుతోంది. తాజాగా ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ కూడా చేరింది. రేపటి (డిసెంబర్‌25) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. పెళ్లి వేడుకలు, ఫంక్షన్లకు కేవలం 200 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. అందరూ కూడా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

నిన్న ఎంపీ.. నేడు యూపీ.. కాగా మరో రెండునెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ ప్రచార పర్వంలో మునిగితేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ ప్రకంపనల దృష్ట్యా ముందు జాగ్రత్తగా యూపీతో పాటు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాద్‌ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అభ్యర్థించిన మరుసటి రోజే ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఆదేశాలను జారీ చేయడం విశేషం. కాగా ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే వారిద్దరూ చికిత్స తీసుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా మధ్యప్రదేశ్ తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రెండో రాష్ట్రం యూపీనే కావడం గమనార్హం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Telangana: సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

Harbhajan Singh: క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...