Harbhajan Singh: క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్..

స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్లకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

Harbhajan Singh: క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్..
Harbajn Sing
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 24, 2021 | 3:27 PM

స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్లకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. జలంధర్‌కు చెందిన 41 ఏళ్ల అతను తన కెరీర్‌లో టీమ్ ఇండియా తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. “ఈ రోజు నేను నా జీవితంలో అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నా. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆనందంగా, చిరస్మరణీయంగా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అని హర్భజన్ సింగ్ శుక్రవారం ట్విట్టర్ పోస్ట్‌లో రాశారు.

1998లో షార్జాలో న్యూజిలాండ్‌తో జరిగిన ODIలో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన హర్భజన్, చివరిసారిగా మార్చి, 2016లో ఢాకాలో UAEతో జరిగిన టీ20లో దేశం తరపున ఆడాడు. మార్చి, 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు హ్యాట్రిక్‌తో సహా మూడు టెస్టుల్లో అతను 32 వికెట్లు పడగొట్టడం అతని అంతర్జాతీయ కెరీర్‌లో మరపురాని క్షణాలలో ఒకటి.

Read Also.. Cricket: సబ్‌స్టిట్యుట్‌గా టెస్టుల్లోకి ఎంట్రీ.. కోహ్లీ, స్మిత్‌లను దాటేశాడు.. ప్రపంచ నెంబర్‌వన్ అయ్యాడు..