AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fertilisers: అన్నదాతలకు శుభవార్త.. విదేశీ ఎరువుల రాయితీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం !

అన్నదాతల ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ మేరకు రైతులకు రసాయన ఎరువుల భారం తగ్గించడంలో

Fertilisers: అన్నదాతలకు శుభవార్త.. విదేశీ ఎరువుల రాయితీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం !
Basha Shek
|

Updated on: Dec 24, 2021 | 4:43 PM

Share

అన్నదాతల ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ మేరకు రైతులకు రసాయన ఎరువుల భారం తగ్గించడంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న ఎరువులపై సబ్సిడీ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ ఇప్పటికే రూ. 20వేల కోట్లు కేటాయించిన కేంద్రం.. ఇప్పుడు సప్లిమెంటరీ గ్రాంట్ ద్వారా మరో రూ. 15వేల కోట్లను ఎరువులపై సబ్సిడీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూరియా ఎరువులపై రాయితీని పెంచవచ్చని సమాచారం. ఈ అదనపు కేటాయింపులకు సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనుందని తెలుస్తోంది. కాగా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరుగుతున్నా ఆ భారం అన్నదాతలపై పడకుండా కేంద్రం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా రైతులు పలు సమస్యలను ఎదుర్కొ్న్నారు. అకాల వర్షాల కారణంగా పొలాల్లోని పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం నుంచి రైతులు కోలుకోకముందే ఎరువుల కొరత అన్నదాతల కష్టాలను రెట్టింపు చేశాయి. ఇదే క్రమంలో కొందరు వ్యాపారులు ఎరువుల బ్లాక్ మార్కెట్లలో విక్రయించారు. దీంతో రైతులు నిర్ణీత ధర కంటే ఎక్కువ చెల్లించి ఎరువులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎరువుల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం విదేశీ రసాయన ఎరువులపై సబ్సిడీని మరింతగా పెంచింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఎరువులకు సబ్సిడీ కోసం అదనంగా రూ.15,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Also Read:

చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

Harbhajan Singh: క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్..

Harbhajan Singh: క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్..