AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadivelu Covid Positive: తమిళ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్‌.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స..

ప్రముఖ తమిళ నటుడు, సీనియర్‌ కమెడియన్‌ వడివేలు కరోనా బారిన పడ్డారు.

Vadivelu Covid Positive: తమిళ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్‌.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స..
Vadivelu
Basha Shek
|

Updated on: Dec 24, 2021 | 5:44 PM

Share

ప్రముఖ తమిళ నటుడు, సీనియర్‌ కమెడియన్‌ వడివేలు కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం లండన్‌ నుంచి తిరిగొచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు పోరూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. అయితే వడివేలు లండన్‌ నుంచి రావడంతో ఒమిక్రాన్‌ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. శనివారం వీటి రిపోర్టులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

కమెడియన్ గా, హీరోగా, నిర్మాతగా..

కాగా ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్, చియాన్ విక్రమ్ కూడా మహమ్మారి బారిన పడ్డాడు. ఇప్పుడు వడివేలుకి కరోనా సోకిందని తెలియగానే కోలీవుడ్  చిత్ర పరిశ్రమలో అలజడి రేగింది. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు  పెడుతున్నారు.  తెలుగులో స్ట్రయిట్ సినిమాలు చేయకపోయినా.. రజనీకాంత్‌, సూర్య, విశాల్ సినిమాలతో మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు వడివేలు.   ‘ప్రేమికుడు’, ‘మిస్టర్‌ రోమియో’, ‘నవ్వండి లవ్వండి’,  ‘ప్రేమ దేశం’, ‘రక్షకుడు’,  ‘ఒకే ఒక్కడు’,  ‘చంద్రముఖి’,  ‘ఆరు’, ‘ఘటికుడు’, ‘పొగరు’,’ దేవా’,  ‘అదిరింది’  తదితర డబ్బింగ్‌ సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ‘హింసించే రాజు 23వ పులకేశి’ తో ఒకేసారి హీరోగా, నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు.  అయితే మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, స్టార్ డైరెక్టర్లు, నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమా కెరీర్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ ఏడాదే మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే ‘నాయి శేఖర్‌ రిటర్న్‌’ సినిమా కోసం లండన్ కు వెళ్లాడు. అందులో భాగంగానే కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.