AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘పుష్ప’రాజ్.. వారం రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని దక్కించుకొని దూసుకుపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా సాగుతుంది.

Pushpa Movie : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'పుష్ప'రాజ్.. వారం రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే..
Pushpa
Rajeev Rayala
|

Updated on: Dec 26, 2021 | 10:56 AM

Share

Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని దక్కించుకొని దూసుకుపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా సాగుతుంది. గంధపుచెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‏లో అదరగొట్టాడు బన్నీ. ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న మెప్పించింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజు రోజుకీ మరింత జోష్‏తో రికార్డ్స్ కలెక్షన్స్ కురిపిస్తోంది.

పుష్ప సినిమా విడుదలై వారం రోజులు అవుతున్నా థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా వారం రోజుల్లో భారీ వసూళ్లను దక్కించుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా వారం రోజుల్లో 229 కోట్లు వసూల్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపు 100 కోట్లవరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ నిర్మించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ స్టోరీ అదేనంటా ?.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..

Follow Us
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!