TTD Sarva Darshan: శ్రీవారి భక్తులకు ఝలక్.. సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ మల్లగుల్లాలు.. కారణమిదేనా..?

TTD Sarva Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ఎప్పుడు విడుదల అవుతాయా? అని ఎదురు చూస్తున్న..

TTD Sarva Darshan: శ్రీవారి భక్తులకు ఝలక్.. సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ మల్లగుల్లాలు.. కారణమిదేనా..?
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 24, 2021 | 7:12 PM

TTD Sarva Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ఎప్పుడు విడుదల అవుతాయా? అని ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ ఝలక్ ఇచ్చింది. ఈ టోకెన్ల విడుదలపై టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది. ఆన్‌లైన్‌లో విడుదల చేయాలా? లేక ఆఫ్‌లైన్‌లో విడుదల చేయాలా? అన్న అంశంపై టీటీడీ ఆలోచనలో పడింది. ఇప్పటికే రూ.300 దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం 5 వేల టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. మరో 5 వేల టోకెన్లను తిరుపతిలోని కౌంటర్‌లో అంటే ఆఫ్‌లైన్‌లో జారీ చేయాల్సి ఉంటుంది.

అయితే, ఈ ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ విషయంలో కన్‌ఫ్యూజన్‌తో ఆన్‌లైన్ టోకెన్ల విడుదలను నిలివేసినట్లు తెలుస్తోంది. తాజాగా తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైన నేపథ్యంలో టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయడంపై టీటీడీ అయోమయంలో ఉంది. సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ టోకెన్ల ఆఫ్‌లైన్ జారీపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

కాగా, జనవరి 1 నుంచి 31 వ తేదీ వరకు.. రోజుకు 12 వేలు చొప్పున.. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేసింది. అలా విడుదల చేశారో లేదో.. మొత్తం టిక్కెట్లు గంటలోపే అయిపోయాయి. జనవరికి సంబంధించి 5,500 వర్చువల్‌ సేవా దర్శన టికెట్లు గురువారం విడుదల కాగా.. అవి కూడా నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయి.

Also read:

RRR Movie New Song : ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమురం భీముడో పాట వచ్చేసింది.. ప్రాణం పెట్టి పాడిన కాలభైరవ..

Big News Big Debate Live Video: ఏపీలో సిని..మా రాజకీయం… ఎవరి వెర్షన్‌ వారిదే

IND vs SA: రాహుల్ ద్రవిడ్ సలహాతోనే మళ్లీ వచ్చాను.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను..