Christmas Eve: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు.. పేరిణి నృత్యంలో ఎమ్మెల్యే కుమార్తెలు సూపర్బ్ ఫెర్ఫార్మెన్స్
Christmas Eve: మేడికొండూరు మండలం పేరేచర్లలో తుళ్ళూరు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో..
Christmas Eve: మేడికొండూరు మండలం పేరేచర్లలో తుళ్ళూరు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే కుమార్తెలు విజయ వెంకటభవ్య, హారికలు చేసిన పేరిణి నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. తాడికొండకు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే ఉండవల్లి తమ కుమార్తెలిద్దరికి పేరిణి నృత్యాన్ని ప్రముఖ నృత్యకారుడు పేరిణి ప్రకాష్ వద్ద శిక్షణ ఇప్పించారు. శివుడిని ఆరాధిస్తూ చేసే నృత్యం పేరిణి. సాధారణ నాట్య కళలు లాలిత్యంగా, సుకుమారంగా ప్రేమను ఒలకబోసినట్టు గా ఉంటాయి. పేరిణి నృత్యంలో అందుకు భిన్నంగా రౌద్ర, వీర రసాలు ప్రధానంగా ఉంటాయి. కాకతీయుల కాలంలో యుద్ధానికి ముందు సైనికుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఈనృత్యాన్ని ప్రదర్శించేవాళ్లు. కాకతీయుల కాలంలో ఇంతటి పేరు గాంచిన ‘పేరిణి’ తర్వాత కాలంలో కనుమరగయ్యే స్థితికివచ్చింది. కాకతీయుల తర్వాతి పాలకులు పేరిణిని ఆదరించలేదు. కానీ.. డెబ్భైవ దశకంలో నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చారు. రామప్పఆలయంలో ఉన్న పేరిణి నృత్య భంగిమల ఆధారంగా తిరిగి ఈ నృత్యానికి జీవం పోశారు. అప్పటినుంచి నటరాజ రామకృష్ణ శిష్యపరంపర ఈ నృత్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ నాట్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ నృత్యంగా ప్రకటించింది. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కుమార్తెలు చేసిన పేరిణి నృత్యాన్ని చూసి హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందించారు.
reporter Nagaraju, Guntur, TV9
Also Read: తమ కార్యకర్తకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత… డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ