AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో రంగంలోకి కొత్త అంబులెన్సులు.. రంగులు కూడా మార్పు …

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్యసేవలకు కొత్త ఊపు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం 190 కొత్త 108 అంబులెన్సులను రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసింది. పాత, తరచూ మరమ్మతులు అవసరమయ్యే వాహనాలను తొలగించి, నూతన సాంకేతిక సదుపాయాలతో కూడిన ఈ అంబులెన్సులను త్వరలో సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్ లాంచ్ చేయనున్నారు.

Andhra: ఏపీలో రంగంలోకి కొత్త అంబులెన్సులు.. రంగులు కూడా మార్పు ...
Ambulance
M Sivakumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 14, 2025 | 10:22 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 190 కొత్త 108 (అత్యవసర) అంబులెన్సులను రోడ్లపై తీసుకురాబోతుంది. దీనివల్ల రోడ్డు, ఇతర ప్రమాద క్షతగాత్రులను ఇప్పటికంటే మరింత వేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు వీలు కలుగుతుంది. కూటమి ప్రభుత్వం టెండరు నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం సిద్ధమైన ఈ కొత్త అంబులెన్సులను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ మరమ్మతులకు గురవుతున్న అంబులెన్సులను తొలగించి, వాటి స్థానంలో ఈ కొత్త అంబులెన్సులను నడుపనున్నారు. దీనివల్ల ‘గోల్డెన్ అవర్’లోనే రోడ్డు, ఇతర ప్రమాద క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా ‘నేషనల్ అంబులెన్సు కోడ్’ ప్రకారం అంబులెన్సులపై రంగులు వేసినట్లు పేర్కొన్నారు.

కాలంచెల్లిన వాహనాలకు ఇక సెలవు

కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక టెండరు ద్వారా ఎంపిక చేసిన ‘భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్లో 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించింది. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల్లో భాగంగా సదరు సంస్థ ఒక్కొక్క అంబులెన్సుకు సుమారు రూ.27 లక్షల వరకు ఖర్చుపెట్టింది. ఇందులో 56 అడ్వాన్సు సపోర్టు, 134 బేసిక్ అడ్వాన్సు సపోర్టు అంబులెన్సులు ఉన్నాయి. అడ్వాన్సు సపోర్టు అంబులెన్సులో ప్రధానంగా రెండు వెంటిలేటర్లు, ఇతర పరికరాలు అందుబాబులో ఉంటాయి. దీనివల్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు వీలవుతుంది. కాల్ సెంటరుకు ఫోన్ వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రులకు గంటలోపు తరలించడాన్ని ‘గోల్డెన్ అవర్’ గా పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 650 అంబులెన్సులు నడుస్తున్నాయి. వీటిలో పాతవాటిని తొలగించగా కొత్తవాటితో కలిపి మొత్తం నడిచే వాహనాల సంఖ్య 731కు చేరుకుంది.

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రంగులు మార్పు

గత ప్రభుత్వ పాలనలో నీలం రంగు, ఆకువచ్చ రంగుతో అంబులెన్సులు ఉండేవి. కేంద్ర ప్రభుత్వ నేషనల్ అంబులెన్స్ కోడ్ ప్రమాణాలనుసరించి ఈ కొత్త 190 అంబులెన్సులపై తెలుపు, ఎరుపు రంగులు ప్రధానంగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోని 108 అంబులెన్సులపై ఇవే రంగులుండాలని కేంద్ర ప్రభుత్వ నేషనల్ అంబులెన్స్ కోడ్ స్పష్టం చేసింది.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా