Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..

ఏపీలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సీఎం జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. ప్రజలంతా తలనొప్పిగా భావించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది సర్కార్. అవును..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..
Andhra Pradesh
Follow us
Shiva Prajapati

|

Updated on: May 20, 2023 | 5:27 PM

ఏపీలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సీఎం జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. ప్రజలంతా తలనొప్పిగా భావించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది సర్కార్. అవును.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ‘ఎనీ వేర్‌ రిజిస్ట్రేషన్‌’ పేరుతో.. ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం జూన్‌ 1 వ తేదీ నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనివల్ల రాష్ట్రంలో ఆస్తులు ఎక్కడున్నా.. తాము నివశిస్తున్న ప్రాంతాల నుంచే రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌకర్యం ఉంది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రాంతం నుంచి.. ఆస్తులు ఉన్న స్థానిక రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పంపి అప్రూవల్ తీసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు తీసుకువచ్చిన ‘ఎనీ వేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానంతో అన్ని పనులు త్వరితగతిన పూర్తవనున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..