Andhra Pradesh: పొత్తులు ఎందుకు – ఒంటరిగా పోటీ చేయండి.. పవన్ కు బాలినేని కౌంటర్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్య నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఎన్ని కలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్య నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఎన్ని కలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పవన్(Pawan Kalyan) పొత్తు పెట్టకుంటే ఎన్నటికీ సీఎం కాలేరని అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఒకసారి కాకపోయినా మరో సారి అవకాశం ఉంటుందని సూచించారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కల్యాణ్ బీజేపీ(BJP), టీడీపీ లను కోరుతున్నారన్న బాలినేని.. ఆయన డిమాండ్ కు ఆయా పార్టీలు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. దీన్నిబట్టి ఆయన ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలుసుకోవాలని హితవు పలికారు. ఇతర పార్టీల నేతల్లా కాకుండా తాము గడపగడపకూ వెళ్లి.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని బాలినేని స్పష్టం చేశారు.
పొత్తులు, సీఎం అభ్యర్థిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక కామెంట్లు చేశారు. 2014లో, 2019లో తగ్గామన్న పవన్.. 2024లో తగ్గేదే లేదన్నారు. అన్నిసార్లు తగ్గాం.. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంలో తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని అన్నారు. మొదటి ఆప్షన్ బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమని, రెండోది జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, మూడోది జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడమని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి