President Election 2022 Schedule: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల.. వీరికి మాత్రమే ఓటు వేసేందుకు ఛాన్స్..
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే జులైలో జరుగుతాయని తెలిపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగుస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే జులైలో జరుగుతాయని తెలిపింది. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ జరగనుంది. జూన్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ జూన్ 29. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న, ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. జూన్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో జూన్ 29 నామినేషన్లకు చివరి తేదీ. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుండడంతో దీన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి రాష్ట్రపతి ఎన్నికను ప్రకటిస్తున్నారు. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల తేదీలు ప్రకటించబడుతున్నాయి. ఢిల్లీలో మాత్రమే నమోదు చేయబడుతుంది. ఢిల్లీ మినహా మరెక్కడా నామినేషన్ ఉండదు.
జూలై 24 నాటికి 16వ రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకారం.. నామినేటెడ్ సభ్యులు (లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీలు) ఓటింగ్ భాగంలో భాగం కాదు. ఓటు వేయడానికి కమిషన్ తన తరపున పెన్ను ఇస్తుంది. ఇది బ్యాలెట్ పేపర్‌ను అందజేసే సమయంలో ఇవ్వబడుతుంది. ఈ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. మరేదైనా పెన్నుతో ఓటు వేసినా ఓటు చెల్లదు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగుస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 2017 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతిని కూడా ఒకేసారి ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాకోవర్ ఇవ్వవద్దని కాంగ్రెస్ భావిస్తోంది.
అలాగే మద్దతు కోసం ఆయా ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగిస్తున్నాయి. భారత రాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు. ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండేదే ఎలక్టోరల్ కాలేజీ. పార్లమెంటులోని రెండు సభలు లోక్‌సభ, రాజ్యసభల సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీల విషయంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కానీ ఎమ్మెల్సీలకు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యుల ఓటుకు ఒక విలువ ఉంటుంది.
ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా ఎమ్మెల్యేలకు మరో విధంగాను ఉంటుంది. 2017 నాటి లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. మొదట ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువగా ఉంటుంది. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగనణలోకి తీసుకుంటారు.