Sai Pallavi: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ను ఫిదా చేసిన భానుమతి.. సాయి పల్లవికి నేను పెద్ద ఫ్యాన్ అంటూ ట్వీట్
భానుమతి.. సింగిల్ పీస్.. హైబ్రిడ్ పిల్ల! అంటూ తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేసిన చెన్నై పిల్ల సాయి పల్లవి.. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను కూడా ఇంప్రెస్ చేసేశారు.
భానుమతి.. సింగిల్ పీస్.. హైబ్రిడ్ పిల్ల! అంటూ తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేసిన చెన్నై పిల్ల సాయి పల్లవి(Sai Pallavi).. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను కూడా ఇంప్రెస్ చేసేశారు. తన అట్రాక్టివ్ లుక్స్, నాచురల్ యాక్టింగ్‌తో.. ఐయామ్ సాయి పల్లవి హ్యూజ్ ఫ్యాన్స్ అనేదాకా తెచ్చుకున్నారు. ఇక వేణు ఊడుగుల డైరెక్షన్లో రానా హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం విరాట పర్వం. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17thన రిలీజ్ అవనుంది. ఇప్పటికే సాంగ్స్ అండ్ ట్రైలర్ ఈ సినిమాపై విపరీతంగా అంచనాలను పెంచేయగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ చేసిన ట్వీట్ తో బాలీవుడ్ మీడియా కూడా ఈ సినిమా పై ఫోకస్ పెట్టింది.
తాజాగా విరాట పర్వం ట్రైలర్ లింక్‌ను తన ట్విట్టర్ హ్యాండలింక్స్ లో పోస్ట్ చేసిన కరణ్.. ట్రైలర్ చాలా బాగుంది రానా.. సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. అంతేకాదు ఐయామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి అని ఆ ట్వీట్లో మెన్షన్ చేసి హార్ట్ ఎమోజీని ఆ లైన్‌కు యాడ్ చేశారు కరణ్. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విరాట పర్వం సినిమాపై బీ టౌన్‌ను కూడా ఓ లుక్కేసేలా చేస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న సాయి పల్లవి. ఈ దెబ్బతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.
This looks fantastic Rana!!!! Can’t wait to see it! Intense Raw and Rivetting!!! You are superb! And I am a huge @Sai_Pallavi92 fan! ❤️ https://t.co/FpvsbHQhQ2
— Karan Johar (@karanjohar) June 6, 2022