Telangana: ఎనిమిదేళ్లుగా డబుల్ పెన్షన్ పొందుతున్న లైన్‌మెన్.. ఇది ఎక్కడో కాదు..
ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.50 లక్షలు వరకు నష్టం తెచ్చిపెట్టింది. వేతన సవరణ సమయంలో యూడీసీ చేసిన చిన్న పొరపాటుతో ఒక రిటైర్డ్ లైన్‌మెన్‌కు ప్రతినెలా వాస్తవంగా రావాల్సిన దానికంటే..
ఓ ఉద్యోగి చేసిన చిన్న తప్పు సంస్థకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది. విధి నిర్వహణలో అతను చేసిన చిన్న నిర్లక్ష్యంతో విద్యుత్తు పంపిణీ సంస్థ ఖజానాకు ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.50 లక్షలు వరకు నష్టం తెచ్చిపెట్టింది. వేతన సవరణ సమయంలో యూడీసీ చేసిన చిన్న పొరపాటుతో ఒక రిటైర్డ్ లైన్‌మెన్‌కు ప్రతినెలా వాస్తవంగా రావాల్సిన దానికంటే రెండింతల పింఛను మంజూరుతో సంస్థ భారీగా నష్టపోయింది. ఇలా జరుగుతోందని ఆలస్యంగా గుర్తించిన అధికారులు విచారణ మొదలు పెట్టారు. బాధ్యులైన రాజేంద్రనగర్ సర్కిల్ ప్రస్తుత జేఏవో బి.శ్రీకాంత్‌ను ఈనెల 3న ఎస్‌ఈ గోపయ్యపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు రాజేంద్రనగర్ సర్కిల్‌లో ప్రస్తుతం జేఏవోగా పని చేస్తున్న బి.శ్రీకాంత్ 2014లో యూడీసీగా రాజేంద్రనగర్ డివిజన్ కార్యాలయంలో పనిచేసేవారు. వేతన సవరణ సమయంలో తన అలక్ష్యం కారణంగా అదే ఏడాది రిటైర్ అయిన లైన్‌మెన్ మహ్మద్ హుస్సేన్‌కు వాస్తవంగా రావాల్సిన దానికంటే డబుల్ పింఛను జారీ చేశాడు. కంప్యూటర్‌లో ఎంటర్ చేస్తున్న సమయలో ఒక్క నెంబర్ బదులు మరో నెంబర్ నొక్కడు అంతే అతనికి వేతనంలో చేరాల్సిన నెంబర్ ఒక్కసారిగా మారిపోయింది.
అంతే ఈ విషయం తెలిసినా లైన్‌మెన్ అధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.49,05,579 అదనంగా అతని ఖాతాలో జమ్మయ్యాయి. ఒక లైన్‌మెన్‌కు ఇంత పింఛను ఎందుకు వస్తుందని డీఈకి అనుమానం వచ్చింది. అసలు సంగతి ఏంటంటూ విచారిస్తే పొరపాటు వెలుగులోకి వచ్చింది.
బాధ్యులైన అప్పటి యూడీసీ, ప్రస్తుతం సర్కిల్ కార్యాలయంలోనే జేఏవోగా చేస్తున్న శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. డివిజన్‌లో అప్పుడు పనిచేసిన వారి పర్యవేక్షణ లోపం ఉన్నట్లు ఆయన విచారణలో తేలింది. వీరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.50 లక్షలకు సంబంధించి పింఛనుదారు నుంచి ప్రతినెలా రూ.40వేలను రికవరీ చేసేలా చర్యలు చేపట్టారు.
అయితే ఇలాంటి పొరపాటు ఇది ఒక్కటే జరిగిందా.. గతంలో మరింకేమైనా జరిగాయా అనే కోణంలో కూడా అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇలా డబ్బులు ఉద్యోగులకు మాత్రం జమయ్యాయా.. ఏదైనా కాంట్రాక్టర్లకు కూడా ఇలా గుడ్డిగా నెంబర్లు నొక్కేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు.