AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills Rape Case: హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం..ఆ నిందితులను మేజర్లుగా పరిగణించాలని వినతి..

మైనర్‌ నిందితుల్ని ట్రైల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ని కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రైల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌గా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్‌కు విఙ్ఞప్తి చేశారు.

Jubilee Hills Rape Case: హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం..ఆ నిందితులను మేజర్లుగా పరిగణించాలని వినతి..
Jubilee Hills Minor Rape Ca
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 09, 2022 | 1:40 PM

Share

బాలిక రేప్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైనర్‌ నిందితుల్ని ట్రైల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ని కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రైల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌గా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్‌కు విఙ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తి పై జువైనయల్ జస్టిస్ దే తుది నిర్ణయం తీసుకోనుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్ధ్యం అన్నిటినీ పరిగణలోకి తీసుకునీ నిర్ణయం వెల్లడించనుంది జువానయల్ జస్టిస్. మైనర్లకు 21 యేళ్లు దాటిన తరువాత వారిని జువనయల్ హోం నుంచి సాధారణ జైల్ కు తరలింపుపై జరుగనుంది.

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో అసలు మిస్టరీ వీడింది. రేప్ జరిగిన ఇన్నోవా కారు వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌దేనని తేలింది. దినాజ్‌ పేరుతో ఈ కారును కొనుగోలు చేశారు. ఏడాదిన్నరగా ఇన్నోవా కారు వాడుతున్నారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్.. మహమ్మద్ మసి ఉలా ఖాన్‌. ఈ నెల 28న డ్రైవర్‌‌ను తీసుకుని వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు.. ఇన్నోవాలో వెళ్లారు. అదే కారులో మైనర్ బాలికపై రేప్ జరిగింది.

ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ. నిందితులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలన్నారు. వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌ విషయం తన పరిధిలోకి రాదన్నారు హోమ్ మంత్రి మహమూద్ అలీ.

ఇవి కూడా చదవండి

ప్రతిపక్షాలు మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ – ఎంఐఎం నేతలకు సంబంధించిన పిల్లలు ఉండటంతోనే కేసు విచారణ వేగంగా జరగలేదని ఆరోపిస్తున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ లీగల్‌ సెల్‌ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు మహిళా కాంగ్రెస్ మౌన దీక్ష చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోంది హస్తం పార్టీ.

జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి ఏ1 నిందితుడు సాదుద్దీన్‌ను రేపటి నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ను ఏడు రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే న్యాయస్థానం మూడు రోజులకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.

అత్యాచారం ఘటనలో ఆరుగురి పాత్ర మాత్రమే ఉందా? ఇంకెవరైనా ఉన్నారా? వాళ్లకి సహకరించింది ఎవరనే దానిపై ఎంక్వైరీ సాగనుంది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు సీసీఎల్స్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జువైనల్ కోర్ట్ విచారించనుంది.