Jubilee Hills Case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో అసలేం జరుగుతోంది..? తాజా అప్‌డేట్స్ ఏంటంటే..
Jubilee Hills Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ అంశం కాస్త పెద్ద చర్చకు దారి తీసింది...
Jubilee Hills Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ అంశం కాస్త పెద్ద చర్చకు దారి తీసింది. ఇక ఈ కేసు విషయంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నిందితులు మైనర్లు అన్న కోణంలో జరుగుతోన్న కేసు విచారణలో పోలీసులు సంచనల నిర్ణయం తీసుకున్నారు.
రేప్ కేసు నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో తాజాగా నెలకొన్ని పరిణామాలు ఏంటి.? కేసు ఏ దిశలో పయనిస్తోంది.? లాంటి వివరాలు..
* జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ నుంచి నేరుగా వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వేర్వేరు కోణాల్లో సాదుద్దీన్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.
* బాలికపై గ్యాంగ్ రేప్ ముందస్తు పథకమేనా? పబ్‌లో ఆమెను ట్రాప్ చేసిందెవరు? ఆ బేకరీకే ఎందుకు తీసుకెళ్లారు? గంట సమయంలో ఏం చేశారు? అత్యాచారం తర్వాత నిందితులు ఎవర్ని కలిశారన్న కోణంలో సాదుద్దీన్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.
* సాదుద్దీన్ ప్రొఫైల్‌ను క్లియర్‌గా అడిగి తెలుసుకోనున్నారు పోలీసులు. అలాగే క్రైమ్ బ్యాగ్రౌండ్‌పై ఆరా తీయనున్నారు. మరోవైపు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని భావిస్తున్నారు. ఆరుగురు నిందితులు ఏ ప్లేస్‌లో కలిసి పబ్‌కి వెళ్లారు..? నేరం జరిగాక ఎక్కడికి వెళ్లారన్న వివరాలను రాబట్టనున్నారు.
* రేప్ కేసు నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరిన నేపథ్యంలో కేసు సీరియస్ దృష్ట్యా మైనర్లను మేజర్లుగా పరిగణించి శిక్షలు వేసే అవకాశం ఉందని అడ్వకేట్ పట్టాభి తెలిపారు.
* రేప్ కేసులో నిందితులు వాడిన ఇన్నోవా కారు అడ్రస్ టీవీ9 సంపాదించింది. సనత్‌నగర్‌కు చెందిన దివాజ్ షానవాజ్ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. 2019లో షానవాజ్ కారు కొన్నాడు. కానీ నాలుగు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాడు. నంబర్ ప్లేట్ లేకుండానే ఇన్నాళ్లు రోడ్లపై తిరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.
* వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ మహ్మద్ మసి ఉల్లాఖాన్‌కు షానవాజ్ ఇన్నోవా వాహనం లీజ్‌కి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అది వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నాడా? లేదంటే వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ హోదాలో తీసుకున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. అధికార దుర్వినియోగానికి పాల్పడితే పోలీసులు నోటీసులిచ్చే అవకాశముంది.
* బాలిక రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారు. వారిలో ముగ్గుర్ని కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే పిటిషన్ వేశారు. మరో ఇద్దర్ని కూడా కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యారు పోలీసులు. సాదుద్దీన్ ఇచ్చే సమాధానాల ఆధారంగా మైనర్లను వేర్వేరుగా విచారించాలని డిసైడ్ అయ్యారు పోలీసులు.
* వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ రాజీనామాపై ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. మహ్మద్ మసి ఉల్లాఖాన్‌ను రిజైన్ చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. బోర్డ్ సభ్యుల ద్వారా ఎన్నిక జరుగుతుందని.. సభ్యులు అవిశ్వాసం పెట్టి నెగ్గితే చైర్మన్‌ను తొలగిస్తారని అన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..