AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాజకీయంగా ఉపయోగం లేకుంటే వారు ఎవర్నీ కలవరు.. మాజీ మంత్రి కొడాలి షాకింగ్ కామెంట్స్

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah), సినీ నటుడు ఎన్టీఆర్‌ భేటీపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్‌ను అమిత్‌షా కలిశారన్నారు. పార్టీని బలోపేతం...

Andhra Pradesh: రాజకీయంగా ఉపయోగం లేకుంటే వారు ఎవర్నీ కలవరు.. మాజీ మంత్రి కొడాలి షాకింగ్ కామెంట్స్
Ganesh Mudavath
|

Updated on: Aug 23, 2022 | 6:46 AM

Share

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah), సినీ నటుడు ఎన్టీఆర్‌ భేటీపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్‌ను అమిత్‌షా కలిశారన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం, విస్తృతపరచుకోవడం కోసం బీజేపీ (BJP) ఎన్నో ప్రయత్నాలు, వ్యూహాలతో ముందుకు వెళ్తోందని, అందులో భాగంగానే ఎన్టీఆర్ర తో భేటీ అయ్యారని చెప్పారు. తారక్ (NTR) స్థాయి పాన్‌ ఇండియాగా ఎదిగిందని, తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన సేవలను ఉపయోగించుకోవడం కోసమే భేటీ జరిగినట్లు వెల్లడించారు. సినిమాలో నటనను ప్రశంసించేందుకే ఈ భేటీ జరిగిందనేది అవాస్తవమని, రాజకీయ కారణంగా కలిసి ఉంటారని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ఉపయోగం లేకుంటే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఒక్క నిమిషం కూడా ఎవర్నీ కలవరని పేర్కొన్నారు. కాగా.. ఆదివారం రాత్రి నోవాటెల్‌ హోటల్‌లో అమిత్‌షా- ఎన్టీఆర్‌ భేటీ జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం భోజనం చేశారు.

అయితే.. అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటి? సినిమాలకే పరిమితమా? లేక రాజకీయ ప్రమేయం ఉందా? అనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్‌ తో బీజేపీ సన్నిహితంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ తన మనసు మార్చుకున్న పక్షంలో ఏపీ బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ ను తమ ప్రచారాస్త్రంగా వాడే అవకాశముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదే విషయాన్ని బండి సంజయ్ వద్ద ప్రస్తావించగా.. అలాంటిదేమీ లేదంటూనే ట్విస్ట్ ఇచ్చారు. మోడీకి ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ ను బట్టీ చూస్తే ఎందరో సినీ ప్రముఖులు పార్టీలోకి వస్తున్నారనీ చెప్పారు. వీటన్నింటిని బట్టీ చూస్తే షా- ఎన్టీఆర్ భేటీ వెనక దాగిన సీక్రెట్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..