Andhra Pradesh: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మహిళలు దుర్మరణం
బంధువుల ఇంట్లో జరిగే శుభ కార్యానికి వెళ్లారు. వారితో ఆనందంగా గడిపారు. కలిసి భోజనాలు చేశారు. ఇక ఇంటికి వెళ్లొస్తామని అయినవాళ్లకు చెప్పి పయనమయ్యారు. ఆనందంగా సాగిపోతున్న వారిపై మృత్యువు పగ బట్టింది. అతి వేగం...
బంధువుల ఇంట్లో జరిగే శుభ కార్యానికి వెళ్లారు. వారితో ఆనందంగా గడిపారు. కలిసి భోజనాలు చేశారు. ఇక ఇంటికి వెళ్లొస్తామని అయినవాళ్లకు చెప్పి పయనమయ్యారు. ఆనందంగా సాగిపోతున్న వారిపై మృత్యువు పగ బట్టింది. అతి వేగం రూపంలో వారి ప్రాణాలు తీసేసింది. వేగంగా ప్రయాణిస్తున్న వారి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రమాద స్థలానికి చేరుకుని మృతులను పరిశీలించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తుండగా మృతులందరూ భీమవారం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఏలూరులో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండుగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి