Crime: వ్యాపారంలో లాభాలు వస్తాయని.. భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించిన భర్త..

మూఢ నమ్మకాలు ఇంకా ఊపిరి పోసుకుంటూనే ఉన్నాయి. డబ్బుపై ఆశ, కుటుంబానికి మంచి జరుగుతోందన్న అత్యాశ కొందరినీ ఈ జాఢ్యం వైపు నడిపిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా పలు ప్రాంతాల్లో ఈ తరహా..

Crime: వ్యాపారంలో లాభాలు వస్తాయని.. భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించిన భర్త..
Crime News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 23, 2022 | 6:34 AM

మూఢ నమ్మకాలు ఇంకా ఊపిరి పోసుకుంటూనే ఉన్నాయి. డబ్బుపై ఆశ, కుటుంబానికి మంచి జరుగుతోందన్న అత్యాశ కొందరినీ ఈ జాఢ్యం వైపు నడిపిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. మూఢ నమ్మకాలను నమ్మవద్దని, తద్వారా ఎవరిపై దాడులకు పాల్పడవద్దని పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మార్పు రావడం లేదు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బుపై అత్యాశతో ఓ భర్త తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని పురమాయించాడు. దిక్కలేని పరిస్థితుల్లో ఆమె అలాగే చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో (Maharashtra) ని పుణెకు (Pune) చెందిన ఓ వ్యక్తి వ్యాపారాలు చేస్తున్నాడు. అతనికి భార్య, కుటుంబం ఉంది. కొన్ని రోజులుగా అతనికి వ్యాపారంలో ఆశించిన మేరకు పురోగతి లేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో కొందరు క్షుద్రపూజ చేయించాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించారు. అంతే కాకుండా ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వస్తాయని మాయమాటలు చెప్పారు. దీంతో వారి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ వ్యక్తం క్షుద్రపూజ చేసేందుకు ఉపక్రమించాడు.

ఇందులో భాగంగా భార్యను అందరిముందు నగ్నంగా స్నానం చేయాలని కోరాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. దీనికి అతని తల్లిదండ్రులు సైతం సహకరించడం గమనార్హం. విధి లేక, దిక్కుతోచని పరిస్థితిలో ఆమె వారు చెప్పినట్లే చేసింది. చుట్టూ ఉన్నవారు కూడా ఈ దారుణాన్ని చూస్తూ ఉన్నారే తప్ప.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అనంతరం వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. అతని తల్లిదండ్రులనూ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సలహా ఇచ్చిన మాంత్రికుడు పరారీలో ఉన్నాడని, అతనినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి