Pawan Kalyan: అందమైన కమలం బురదలోనే పుడుతుంది.. పార్టీపరంగా లోపాలను సరిదిద్దుకునే ప్రక్రియను ప్రారంభిస్తామన్న జనసేనాని

తన అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఏ ఒక్కరిది కాదని.. మంచి సినిమా వస్తే అందరూ ఆదరిస్తారని.. అందుకు 'కార్తికేయ 2 సాక్ష్యమని చెప్పారు.

Pawan Kalyan: అందమైన కమలం బురదలోనే పుడుతుంది.. పార్టీపరంగా లోపాలను సరిదిద్దుకునే ప్రక్రియను ప్రారంభిస్తామన్న జనసేనాని
Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2022 | 5:18 PM

Pawan Kalyan: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలు చేసిన ప్రతివారు వినోబా భావే అయిపోరని అన్నారు. జనసేన జీరో బడ్జెట్ అంటే అర్ధం వేరే విధంగా చేసుకుంటున్నారని.. ఎన్నికల సమయంలో కార్యకర్తలకు కనీసం టీ కూడా ఇప్పించడం లేదని చెప్పారు. మనం ఒక లక్ష్యంవైపు వెళ్తుంటే.. మరికొందరు వారి వారి స్థాయిలో కిందకు లాగడానికి చేస్తుంటారని చెప్పారు. పెట్టుబడికి అనుకూలంగా లేనంతకాలం రాయలసీమ వెనుకబడే ఉంటుందని చెప్పారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. దీని కోసం అన్ని కులాలను కలుపుకుపోతామని తెలిపారు. పార్టీ PAC సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పవన్‌ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా నమ్మారని పవన్‌ అన్నారు. ఈ దిశగా పార్టీపరంగా లోపాలను సరిదిద్దుకునే ప్రక్రియను సెప్టెంబర్‌ నుంచి ప్రారంభింస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఏ ఒక్కరిది కాదని.. మంచి సినిమా వస్తే అందరూ ఆదరిస్తారని.. అందుకు ‘కార్తికేయ 2 సాక్ష్యమని చెప్పారు. ‘కార్తికేయ 2’ గురించి ప్రస్తావించారు పవన్. నిఖిల్‌ అనే హీరో కార్తికేయ మూవీ వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తోందని అన్నారు.

ఇవి కూడా చదవండి

తాను మార్పు రావాలని కోరుకుంటానని.. మార్పంటే ఇదేనని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోని  కంటపడగా దీనిని తాను ట్వీట్ చేశాడు. ‘ఆయన మాటల్లో సినిమా గురించి, నా గురించి వినడం సంతోషం’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు నిఖిల్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..