AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రియురాలి మోజులో పడి.. తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు.. చివరకు ఊహించని విధంగా

ప్రియురాలి మోజులో పడిన ఓ యువకుడు తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. తప్పని చెప్పిన తల్లిదండ్రులను బెదిరించాడు. ఇంటికి రావాలని కోరితే చనిపోతానని భయపెట్టాడు. చివరికి అనారోగ్యంతో..

Andhra Pradesh: ప్రియురాలి మోజులో పడి.. తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు.. చివరకు ఊహించని విధంగా
Ganesh Mudavath
|

Updated on: Aug 23, 2022 | 8:07 AM

Share

ప్రియురాలి మోజులో పడిన ఓ యువకుడు తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. తప్పని చెప్పిన తల్లిదండ్రులను బెదిరించాడు. ఇంటికి రావాలని కోరితే చనిపోతానని భయపెట్టాడు. చివరికి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలోని కాసిరాళ్ల గ్రామానికి చెందిన సురేష్‌.. పలమనేరులో పని చేస్తున్నాడు. అనంతపురం జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఉపాధి కోసం అదే కోళ్లఫారంలో చేరింది. ఆమెకు సురేష్‎ తో పరిచయం ఏర్పడింది. తన అన్న కుమార్తెతో పెళ్లి చేస్తానని నమ్మించింది. ఈ క్రమంలో అతనికి శారీరకంగా దగ్గరైంది. వీరిద్దరూ పలమనేరులో పనిని వదిలేసి, చింతలపల్లికి వచ్చేశారు. సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. వీరిద్దరూ గ్రామంలోని ఓ ఇంట్లో ఉంటూ సహజీవనం చేసేవారు. కొన్నేళ్లుగా సురేశ్ వ్యవసాయ పనులకు వెళ్లి, వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. మరోవైపు.. ఉపాధి కోసం వెళ్లిన కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తెలిసిన వారి వద్దకు వెళ్లి గాలించారు. అయినా లాభం లేకుండా పోయింది. ఎలాగోలా కష్టపడి సురేశ్ ఆచూకీ తెలుసుకున్నారు. అతనిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు చింతలపల్లికి వెళ్లారు. సురేశ్ ను కలిసి, ఇంటికి రావాలని కోరారు. అయితే తల్లిదండ్రుల అభ్యర్థనను సురేశ్ తిరస్కరించాడు. చావనైనా చస్తానుగానీ, ఇంటికి రానంటూ కత్తితో కోసుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక కడుపుకోతతో వారు తిరిగి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో సురేశ్ అనారోగ్యానికి గురయ్యాడు. పచ్చకామెర్లు సోకడంతో ఆస్పత్రి పాలయ్యాడు. డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో చింతలపల్లిలో ఉంటున్న సురేశ్ భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం ఎంత లేపినా లేవకపోయేసరికి స్థానికులు వచ్చి చూశారు. చనిపోయాడని నిర్థరించుకున్నారు. విషయాన్ని మృతుని తల్లిదండ్రులకు తెలిపారు. ఈ ఘటనతో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు తమ కుమారుడి మృతికి రాజకుమారి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ కు చికిత్స చేయించకుండా అతని మృతికి కారణమైందని కేసు పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి